సెక్సీగా ఉందనేనా? ఇదీ శృతి హాసన్ పొజిషన్ (ఫోటో ఫీచర్)
హైదరాబాద్: ఈ మధ్య తెలుగు సినిమాల్లో శృతి హాసన్ చాలా బిజీ అయిపోయింది. టాప్ హీరోలంతా ఆమెతో స్క్రీన్ రొమాన్స్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. మరో వైపు ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా రోజు రోజుకు పెరిగి పోతోంది. తాజాగా హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన ఆన్ లైన్ సర్వేలో శృతి హాసన్ టాప్ పొజిషన్లో నిలిచింది.
హీరోయిన్లందరికంటే ఆమెకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. సెక్సీ లుక్స్, సెక్సీ ఆటిట్యూడ్, సూపర్ పెర్ఫార్మెన్స్ వెరసి ఆమెను టాప్ పొజిషన్లో నిలబెట్టినట్లు స్పష్టమవుతోంది. నయనతార, తమన్నా, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్ హీరోయిన్లు శృతి హాసన్ కంటే వెనకబడిపోవడం గమనార్హం.
ఆశ్చర్యకరంగా సమంత, అనుష్క, అమలా పాల్, తాప్సీ, ప్రణీత లాంటి హీరోయిన్లకు టాప్ 10లో చోటు దక్కలేదు. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో....

శృతి హాసన్
బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ అందుకుంటున్న శృతి హాసన్ హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన సర్వేలో మెస్ట్ డిజైరబుల్ ఉమెన్‌గా నెం.1 స్థానం దక్కించుకుంది.

తమన్నా
హీరోయిన్ తమన్నా మెస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2013 సర్వేలో 2వ స్థానంలో నిలిచింది.

శ్రీయ
హీరోయిన్ శ్రీయ ఈ సర్వేలో 3వ స్థానం దక్కించుకుంది.

ఇలియానా
మరో హీరోయిన్ ఇలియానా ఈ సర్వేలో 4వ స్థానంలో నిలిచింది.

శోభిత
మోడల్ శోభిత ధూళిపాళ్ల ఇటీవల మిస్ ఇండియా ఎర్త్ 2013 కిరీటం దక్కించుకుంది. హైదరాబాద్ టైమ్స్ సర్వేలో ఆమెకు 5వ స్థానం దక్కింది.

హన్సిక
ఇక హీరోయిన్ హన్సికకు ఈ సర్వేలో 6వ స్థానం దక్కింది.

క్రితి సనన్
మహేష్ బాబు ‘1 నేనొక్కడినే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ క్రితి సానన్ ఈ సర్వేలో 7వ స్థానం దక్కించుకుంది.

నయనతార
సౌతిండియా స్టార్ హీరోయిన్ నయనతార ఈ సర్వేలో 8వ స్థానం దక్కించుకుంది.

రాకుల్ ప్రీత్ సింగ్
‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చిన రాకుల్ ప్రీత్ సింగ్ 9వ స్థానం దక్కించుకుంది.

కాజల్ అగర్వాల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు ఈ సర్వేలో 10వ స్థానం దక్కింది.


Click it and Unblock the Notifications











