కమల్ కూతురైతేనేం
కమల్ హాసన్ కూతురు శృతిహాసన్ నటిస్తున్న మొదటి సినిమా అంటూ లక్ చిత్రం ఈ వారం రిలీజైంది. అయితే ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద కుదేలైంది. కమల్ కూతురు కదా నటనలో తండ్రి వారసత్వం అందిపుచ్చుకుందేమోనంటూ ధియోటర్స్ లోకి దూరిన వాళ్లు తలలు పట్టుకుంటూ బయిటపడుతున్నారు. కథలో ప్రపంచంలో లక్ (అదృష్టం)ఉన్న వారందరని పోగుచేసి సంజయ్ దత్ ఓ గేమ్ పెడతాడు. ఆ అదృష్టవంతుల్లో మిగిలేది ఎవరా అన్నంతలా డెత్ గేమ్ అది. అయితే సంజయ్ దత్ కీ తానో పెద్ద లక్ ఉన్న వ్యక్తినని నమ్మకం. అయితే చిత్రం మొత్తం ఈ గేమ్ గోలతో సరిపోవటంతో ఓ వీడియో గేమ్ చూస్తున్న ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగింది. దాంతో కమల్ కూతురు తెరంగ్రేటం సినిమా పేలిపోయింది. అప్పటికీ శృతి తన ప్రారంభ చిత్రం ద్వారా ఎట్లాగయినా గెలవాలని బికీనీ సైతం వేసింది. అదీ రక్షించలేకపోయింది. దాంతో కమల్ కూతురు అనే ముద్ర,బికినీ పనికిరాకుండా పోయాయి. అయితే ఇదేమీ పట్టించుకోకుండా మరో సారి బెటర్ లక్ అంటోది శృతి మాత్రం. ఇక ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు కూడా గెస్ట్ రోల్ లో కనపడతాడు. గతంలో అజయ్ దేవగన్ తో కాల్ చిత్రం తీసి తెరమరుగైన దర్శకుడు సోహమ్ షా ఈ చిత్రాన్ని రూపొందించాడు.


Click it and Unblock the Notifications











