మహేష్ ‘ఆగడు’: తమన్నాకు శృతి హాసన్ షాక్?
హైదరాబాద్ : మహేష్‌బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్లో త్వరలో తెరకెక్కబోయే చిత్రం 'ఆగడు'. ఈ చిత్రంలో హీరోయిన్‌గా తమన్నా నటిస్తోందని ఇప్పటి వరకు విన్నాం. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తమన్నా స్థానంలో శృతి హాసన్‌ను తీసుకునే ఆలోచలో ఉన్నారట దర్శక నిర్మాతలు.
ఇప్పటికే ఈ సినిమాలో కథానాయికగా మిల్కీ బ్యూటీ తమన్నాను ఎంపిక చేసుకున్నారు. అయితే, ఈ ఎంపికపై దర్శకనిర్మాతలు పునరాలోచిస్తున్నారని, శ్రుతిహాసన్ అయితే మహేష్‌కి సరిజోడిగా వుండటమే కాకుండా ఫ్రెష్‌నెస్ కూడా ఉంటుందని, భావిస్తున్నారట. త్వరలో ఏ విషయం అనేది ఖరారు కానుంది.
ఈచిత్రాన్ని సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేయడానికి దర్శకుడు శ్రీను వైట్ల ప్లాన్ చేసాడట. అంటే షూటింగ్ ఒక్కసారి మొదలైతే పూర్తయ్యే వరకు గ్యాప్ లేకుండా కొనసాగుతూనే ఉంటుందన్నమాట. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్. శ్రీను వైట్ల ఇప్పటికే స్క్రిప్టు వర్క్ పూర్తి చేసారు. ప్రీ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి.
'ఆగడు' సినిమాను రూ. 40 కోట్ల బడ్జెట్ మించకుండా పూర్తి చేయాలని, అప్పుడే నిర్మాతలకు, బయ్యర్లకు మంచి జరుగుతుందని మహేష్ బాబు శ్రీను వైట్లు సూచించినట్లు తెలుస్తోంది. తన సినిమా నష్టాల పాలైతే తనకే చెడ్డపేరు కాబట్టి మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మహేష్ బాబు ఆలోచన పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
ప్రస్తుతం మహేష్ బాబు నటిస్తున్న 1(నేనొక్కడినే) సినిమాతో పాటు 'ఆగడు' చిత్రాన్ని కూడా 14రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ యే నిర్మిస్తుంది. ఈ సినిమాల నిర్మాతలైన రామ్ ఆచంట, గోపి ఆచంటమరియు అనీల్ సుంకర మహేష్ కు సన్నిహితులు. 1(నేనొక్కడినే) సినిమా 2014 సంక్రాంతికి విడుదలకానుంది.


Click it and Unblock the Notifications











