మేగజైన్ కోసం లోదుస్తుల్లో సెక్సీగా శృతి హాసన్
హైదరాబాద్ : హీరోయిన్లు పబ్లిసిటీ కోసం 'మాగ్జిమ్' లాంటి మేగజైన్ కవర్ పేజీల కోసం తమ అదాలను హాట్ అండ్ సెక్సీగా ఆరబోయడం చాలా కాలంగా జరుగుతున్న తంతే. తాజాగా ఈ లిస్టులో హీరోయిన్ శృతి హాసన్ కూడా చేరింది. లో దుస్తుల్లో అభిమానులకు అందాల విందు చేసింది.
గబ్బర్ సింగ్ చిత్రం భారీ విజయం సాధించడంతో పాటు హీరోయిన్‌గా ఆమెకు బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా విజయంతో శృతి స్టార్ హీరోయిన్ గా మారడంతో పాటు తెలుగులో పలువురు స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంది. గబ్బర్ సింగ్ చిత్రం శృతి కెరీర్లో తొలి బ్లాక్ బస్టర్.
ప్రస్తుతం శృతి హాసన్ రవితేజతో బలుపు, రామ్ చరణ్ తేజ హీరోగా రూపొందుతున్న ఎవడు చిత్రాల్లో నటిస్తోంది. అదే విధంగా అల్లు అర్జున్ హీరోగా త్వరలో రూపొందబోయే 'రేస్ గుర్రం' చిత్రంలో కూడా శృతి హాసన్ ఎంపికయింది. మరో వైపు శృతి హాసన్ హిందీలో ప్రభుదేవా దర్శకత్వంలో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం చేస్తోంది. తెలుగులో హిట్టయిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రానికి ఇది రీమేక్.


Click it and Unblock the Notifications












