దూకుడులా దూసుకుపోతున్న శృతి హాసన్..!
కొంతమందికి హిట్లున్నా సినిమాలు రావు... కొందరికి హిట్లు లేకపోయినా సినిమాలు వస్తూనే వుంటాయి. శృతి హాసన్ ఇక్కడ రెండో కోవకు చెందిన తార. విజయాలు లేకపోయినా అదృష్టాన్ని సొంతం చేసుకున్న కథానాయికగా శృతి హాసన్ ని చెప్పుకోవచ్చు. సంగీత దర్శకురాలిగా కెరీర్ ఆరంభించి గాయనిగా హస్కీ వాయిస్‌తో సంగీతప్రియులను ఆకట్టుకుని ఆ తర్వాత తన తండ్రి కమల్ హాసన్ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న శృతి హాసన్ ఇప్పుడు నటిగానే కాదు సింగర్‌గా కూడా బిజీ అయింది. అనగనగా ఓ ధీరుడు చిత్రంలో కథానాయికగా పరిచయమై టాలీవుడ్ యువహృదయాలను దోచుకుంది.
అయితే ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా లేకపోయినప్పటికీ, ఆమె సినిమాలతో బిజీగానే వుంది. తెలుగులోప్రస్తుతం ఆమె సిద్దార్ద సరసన ఓ మై ప్రెండ్ చిత్రం విడుదలకు సిద్దమౌతోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఆ చిత్రాన్ని వేణు శ్రీరామ్ అనే నూతన దర్శకుడు డైరక్ట్ చేస్తున్నాడు. అలాగే ఆ చిత్రంలో హన్సిక మరో హీరోయిన్ గా చేస్తోంది. ఈ చిత్రంతో పాటు శృతి హాసన్... జూ ఎన్టీఆర్, పవన్ కల్యాణ్, తమిళంలో సూర్య, ధనుష్ వంటి హీరోలతో సినిమాలు చేస్తూ కథానాయికల రేసులో శృతి ముందు వరసలో వుంది.
తాజాగా ఈ భామను ఓ బాలీవుడ్ సినిమా కూడా వరించింది. రణభీర్ కపూర్ హీరోగా రూపొందే 'సద్దా హక్ రాక్ స్టార్' అనే చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఆమధ్య 'జబ్ వీ మెట్', 'లవ్ ఆజ్ కల్' చిత్రాలకు దర్శకత్వం వహించిన ఇంతియాజ్ అలీ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఎఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం బాలీవుడ్ లో తనకు మంచి బ్రేక్ అవుతుందని శృతి ఆశిస్తోంది.


Click it and Unblock the Notifications











