పంజా పనైపోయింది...గబ్బర్ సింగ్ పనిబట్టారు పవన్...!
సినిమా షూటింగ్ పూర్తి చేసి, డబ్బింగ్ చెప్పేయడంతో ఓ సినిమాకి తనవంతుగా పని అయిపోయిందని భావించే పవన్ కళ్యాణ్ 'పంజా" చిత్రం పవన్ ముగించుకుని గబ్బర్ సింగ్ పనితో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం ఈ చిత్రం పొల్లాచిలో షూటింగ్ జరుపుకుంటోంది.
సల్మాన్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ 'దబాంగ్" సినిమాకి రీమేక్ అయిన గబ్బర్ సింగ్ వచ్చే వేసవిలో విడుదల కానుంది. గణేష్ బాబు నిర్మాణం లో శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ లో హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. రీసెంట్ గా శృతి హాసన్ నటించడం లేదని ఆమె ప్లేస్ లో ఇలియానా నటిస్తోందన్న రూమర్ కి ఫుల్ స్టాప్ పెడుతూ శృతి హాసన్ ఈ రోజు నుండి షూటింగ్ లో పాల్గొంటోంది. పొల్లాచిలో పవన్ కళ్యాన్, శృతి హాసన్ లతో ముఖ్యమైనటువంటి కొన్ని సీన్స్ మరియు సాంగ్ చిత్రీకరించనున్నారని సమాచారం.
చిత్రమైన క్యారెక్టర్ ఉన్న పోలీస్ గా ఇందులో పవన్ కనిపిస్తాడు. దబాంగ్ లో హీరో క్యారెక్టరైజేషన్ బాగా నచ్చడంతో పవన్ ఈ సినిమా రీమేక్ చేయడానికి అంగీకరించాడు. పంజా విషయంలో పూర్తి సంతృప్తి లభించడంతో నటుడిగా 'గబ్బర్ సింగ్" చిత్రాన్ని ఇంకాస్త జోష్ తో చేస్తున్న పవన్ వరుసగా రెండు హిట్లు కొడతారేమో చూద్దాం.


Click it and Unblock the Notifications











