»   »  శృతిహాసన్ ఇలా రెచ్చిపోయిందేంటి?( హాట్ ఫొటో షూట్)

శృతిహాసన్ ఇలా రెచ్చిపోయిందేంటి?( హాట్ ఫొటో షూట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కమల్ హాసన్ కూతురుగా తెరంగ్రేటం చేసినా మొదటినుంచీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది హీరోయిన్ శృతి హాసన్. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో గడ్డుకాలం ఎదుర్కొన్నప్పటికీ ఓపికతో ముందుకు సాగుతూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. నటన పరంగానే కాదు...గ్లామర్ పరంగా కూడా తనదైన ముద్ర వేస్తూ దూసుకెలుతోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

కొద్ది రోజుల క్రితం కామసూత్ర భంగిమతో అలజడి రేపిన శృతిహాసన్ ..తను ఎలాంటి ఎక్సపోజింగ్ కైనా రెడీ అన్నట్లు సంకేతాలు వదిలింది. గబ్బర్ సింగ్ వరకూ తెలుగులో సరైన హిట్టులేని శృతిహాసన్‌ ఆ సినిమా హిట్ కావడంతో అందరికీ గోల్డెన్ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలన్నీ విజయం సాధించాయి.

'డాడీ పేరు సినిమా రంగంలో ఎప్పుడూ వాడుకోలేదు. కమల్‌ కూతురు అని ఎవరూ నాకు పనిగట్టుకొని అవకాశాలూ ఇచ్చేయలేదు. కానీ నాలో నటనకు, సంగీతానికి... సినిమా అంటే ప్రేమ పెరగడానికి బీజం వేసింది మాత్రం డాడీనే. సినిమా అంటే వ్యామోహం ఆయన వల్లే కలిగింది' అంటోంది శృతిహాసన్.

తాజాగా శృతి హాసన్ జ్యూస్ మ్యాగజైన్ కోసం హాట్ అండ్ సెక్సీగా ఫోజులు ఇచ్చి కుర్రకారు మతి పోగొట్టింది. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

అసలు పేరు...పుట్టిన తేదీ

అసలు పేరు...పుట్టిన తేదీ

శృతి హాసన్ పూర్తి పేరు శృతి రాజ్యలక్ష్మి హాసన్. ప్రముఖ నటుడు కమల్ హాసన్, సారిక దంపతులకు జనవరి 28, 1986లో జన్మించింది. ఆమె కేవలం నటి మాత్రమే కాదు...మంచి సింగర్, మ్యూజిక్ కంపోజర్ కూడా.

మొదటి సారి

మొదటి సారి

బాలీవుడ్ మూవీ ‘లక్' చిత్రం ద్వారా శృతి హాసన్ 2009లో హీరోయిన్‌గా కోరీర్ ప్రారంభించింది. అయితే తొలి చిత్రం ఆమెకు నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత ఆమెకు అవకాశాలేవీ రాలేదు. ఆ తర్వాత 2011లో ‘అనగనగా ధీరుడు' చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం కూడా ఆమెకు నిరాశనే మిగిల్చింది.

గబ్బర్ సింగ్‌తోనే...

గబ్బర్ సింగ్‌తోనే...

మొదట చేసిన 7 సినిమాలకు శృతి హాసన్‌కు కలిసిరాలేదు. 2012లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రం ద్వారా తొలి విజయం రుచి చూసింది. ఆ తర్వాత ఆమె పలు సినిమాలతో బిజీ అయింది.

తెలుగు చిత్రాలు

తెలుగు చిత్రాలు

శృతి హాసన్ తెలుగులో నటించిన ‘ఎవడు',రేసుగుర్రం చిత్రం ఇటీవల విడుదలైన బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధించింది. మహేష్ బాబు సరసన కొరటాల శివ దర్సకత్వంలో రూపొందే చిత్రం చేస్తోంది.

హర్రర్ కూడా..

హర్రర్ కూడా..

కార్తీ హీరోగా నటించనున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్‌ను ఎంపిక చేసినట్టు తమిళ చిత్ర వర్గాల సమాచారం. కార్తీ, శృతిహాసన్ కలిసి నటించనున్న తొలి చిత్రమిదే కావడం విశేషం. గోకుల్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని స్టూడియోగ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. ఈ చిత్రానికి కాష్మోర అనే టైటిల్‌ని ఖరారు చేశారు.

రెమ్యునేషన్

రెమ్యునేషన్

మహేష్‌బాబు కొత్త చిత్రంలో శృతిహసన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందుకోసం ఆమెకు కోటి పాతికలక్షలు ఇవ్వడానికి నిర్మాత అగ్రీమెంట్‌ కుదుర్చుకున్నారని సమాచారం. కాస్ట్యూమ్స్‌, మేకప్‌, వసతి అదనం. ఇవన్నీ మరో పాతికలక్షల వరకు అవుతుంది. శృతిహసన్‌ నటించిన పలు చిత్రాలు విజయం సాధించడం వల్ల, ఆమెతో మహేష్‌ తొలి కాంబినేషన్‌ కావడం వల్ల అడిగినంత ఇవ్వడానికి సిద్దమయ్యారని అంటున్నారు.

English summary
Sruthi hassan said she is very much happy with tollywood. She Poses For Juice Magazine Hot Photoshoot
Please Wait while comments are loading...