»   » మహేష్‌తో రొమాన్స్ చేయనున్న శృతి హాసన్?

మహేష్‌తో రొమాన్స్ చేయనున్న శృతి హాసన్?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హీరోయిన్ శృతి హాసన్ జోరు టాలీవుడ్లో రోజురోజుకు విస్తరిస్తోంది. ఇప్పటికే తెలుగులో టాప్ హీరోలైన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ తేజ్, జూ ఎన్టీఆర్ సినిమాల్లో చాన్సులు దక్కించుకున్న శృతి హాసన్ తాజాగా మరో భారీ చాన్స్ కొట్టేసింది. త్వరలో శృతి హాసన్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రొమాన్స్ చేయబోతోందని తెలుస్తోంది.

ప్రస్తుతం మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో '1' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పూర్తయిన తర్వాత మహేష్ బాబు-శ్రీను వైట్ల కాంబినేషన్లో 'ఆగడు' సినిమా రాబోతోంది. ఆగడు తర్వాత మహేష్ బాబు 'మిర్చి' దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేసే ప్లాన్లో ఉన్నట్లు సమాచారం.

కొరటాల శివ-మహేష్ బాబు కాంబినేషన్లో రాబోయే చిత్రంలో శృతి హాసన్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. శృతి హాసన్ స్క్రీన్ ప్రెసెన్స్‌పై మహేష్ బాబు మెస్మరైజ్ అయ్యాడని, ఆమెనే ఈ సినిమాకు ఫైనల్ చేసే అవాకాశం ఉన్నట్లు టాక్. ఈ చిత్రాన్ని బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ 'యూటివి' ప్రొడ్యూస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ విషయాలు అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది.

ప్రస్తుతం మహేష్ నటిస్తున్న '1' సినిమా విషయానికొస్తే ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ యూరఫ్‌లో జరుగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా మహేష్ తనయుడు గౌతం కృష్ణ బాలనటుడుగా తెరంగ్రేటం చేయబోతున్నారు.

English summary
Tollywood film sources are at a buzz that Mahesh Babu will be pairing up with Shruthi Hassan for his upcoming film directed by Koratala Shiva.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu