»   » అతడు చెప్పేవన్నీ అబద్దాలే: శృతి హాసన్

అతడు చెప్పేవన్నీ అబద్దాలే: శృతి హాసన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: హీరోయిన్ శృతి హాసన్‌పై ఇటీవల ముంబైలోని తన అపార్టుముంటులో ఓ గుర్తు తెలియని వ్యక్తి దాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. సిసి టీవీ పుటేజ్ ఆధారంగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేసారు. నిందితుడు అశోక్ శంకర్ త్రిముఖే(45)గా గుర్తించారు. అతడు ఫిల్మ్ సిటీలో స్పాట్ బాయ్‌గా పని చేస్తున్నట్లు గుర్తించారు.

తాను సోదరుడికి ఉద్యోగం కోసం శృతి హాసన్ ఇంటికి వెళ్లాలని.. తాను చెప్పడానికి ప్రయత్నిస్తుండగానే ఆమె డోర్ వేసేశారని అశోక్ శంకర్ పోలీసులకు చెప్పాడు. అంతేకానీ, ఆమెను బెదిరించాలన్నది తన ఉద్దేశం కాదని చెప్పాడు. అయితే అశోక్ శంకర్ త్రిముఖే వాదనను శృతి హాసన్ ఖండించారు.

పోలీసులకు అశోక్ శంకర్ త్రిముఖే చెప్పేది అవాస్తవమని, ఒంటరిగా ఒక ఆడపిల్ల ఉంటున్న పార్టుమెంటులోకి రాత్రి 9.30 గంటలకు రావాల్సిన అవసరం ఏమిటని ఆమె ప్రశ్నించారు. అతడు అనేక సందర్భాల్లో సినిమా సెట్లలో కనిపించాడని, అప్పుడెప్పుడూ తనతోగానీ, తన సిబ్బందితో గానీ అతని సోదరుడి ఉద్యోగం గురించి ఎందుకు మాట్లాడలేదని, దురుద్దేశంతోనే తన ప్లాటుకు వచ్చాడనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలనే విధంగా శృతి హాసన్ స్పందించారు.

బాంద్రా పోలీసుల కథనం ప్రకారం మంగళవారం ఉదయం 9.30గంటల సమయంలో నిందితుడు శంకర్ శృతి హాసన్ ఇంటికి వెళ్లి డోర్ బెల్ కొట్టాడు. ఆమె తలుపుతీయగా.. తనను ఎందుకు గుర్తు పట్టలేదని ప్రశ్నించాడు. ఆమె భుజంపై చేయి వేశాడు. దీంతో శృతి హాసన్ నిందితుడిని గట్టిగా బయటకు నెట్టేసి తలుపు వేసేసింది.

English summary
Actress Shruti Hassan made it to the headlines following her complaint against her stalker, who tried to barge into her house in Mumbai on November 19. Finally, the Mumbai police are successful in nabbing the person with the help of her CCTV footage on Sunday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu