నువ్వొస్తానంటే నేనొద్దంటా హిందీ రీమేక్ : శృతి హాసన్ ఫస్ట్‌లుక్
ఇటీవల 'రౌడీరాథోడ్'తో సినిమాతో బాలీవుడ్లో భారీ హిట్ కొట్టిన ప్రభుదేవా తాజాగా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో త్రిష చేసిన పాత్రకు గానూ శృతి హాసన్ ని ఎంపిక చేసారు. ఈ చిత్రం హిందీలో 'రామయ్య వస్తావయ్యా' అనే పేరుతో రూపొందుతోంది. తాజాగా దీనికి ఫస్ట్ లుక్ రిలీజైంది.
ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ నిర్మాత కుమార్ తౌరాని తనయుడు గిరీస్ కుమార్ ను హీరోగా పరిచయం చేస్తున్నాడు ప్రభుదేవా. ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ జరుగుతోంది. బాలీవుడ్ వాతావరణానికి తగిన విధంగా చిత్రంలో కొన్ని మార్పులు చేర్పులు చేసారు. జూన్ 21న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రభుదేవా వరసగా హిందీలో రీమేక్ లు చేసుకుంటూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. సల్మాన్ ఖాన్‌తో వాంటెడ్, మొన్న విక్రమార్కుడు రీమేక్ గా 'రౌడీరాథోడ్'రూపొందించి సూపర్ హిట్ కొట్టారు. ఇప్పుడు అతని దృష్టి తెలుగులో ఘన విజయం సాధించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'పై పడింది.
తెలుగు వెర్షన్‌లో త్రిష, సిద్దార్ద కాంబినేషన్‌లో ఎమ్.ఎస్ రాజు నిర్మాతగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఇక్కడ ఘన విజయం సాధించింది. దాంతో హిందీలోనూ ఈ సినిమా వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. రీమేక్ సినిమాలను సక్సెస్ ఫుల్‌గా తెరకెక్కిస్తాడు అనే పేరున్న ప్రభుదేవా ఈ సినిమాను కూడా తనదైన మార్కుతో తెరకెక్కిస్తున్నారు.

రామయ్య వస్తావయ్యా...శృతి హాసన్ ఫస్ట్ లుక్

ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ నిర్మాత కుమార్ తౌరాని తనయుడు గిరీస్ కుమార్ ను హీరోగా పరిచయం చేస్తున్నాడు ప్రభుదేవా.

తెలుగు వెర్షన్‌లో త్రిష, సిద్దార్ద కాంబినేషన్‌లో ఎమ్.ఎస్ రాజు నిర్మాతగా ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఇక్కడ ఘన విజయం సాధించింది.


Click it and Unblock the Notifications











