»   » వేశ్యగా శృతి హాసన్‌ సెక్సీ సీన్లు: గెలుపు గుర్రం(ఫోటోస్)

వేశ్యగా శృతి హాసన్‌ సెక్సీ సీన్లు: గెలుపు గుర్రం(ఫోటోస్)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: పాపులర్ తెలుగు హీరోయిన్ శృతి హాసన్ తన చివరి బాలీవుడ్ మూవీ 'డి-డే'లో హాట్ అండ్ సెక్సీ పెర్ఫార్మెన్స్‌తో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శృతి హాసన్ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌తో కలిసి శృంగార భంగిమల్లో నటించడం అప్పట్లో ఓ సెన్సేషన్. తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

  ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం నిర్మాత సురేస్ దూడల తెలుగు డబ్బింగ్ రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తెలుగులో ఈచిత్రాన్ని 'గెలుపు గుర్రం' పేరుతో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శృతి హాసన్ నటించడం, హాట్ హాట్ సీన్లు ఉండటంతో ఇక్కడ మంచి వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

  సురేష్ సినిమా, దార్ సినిమా బేర్లపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. ఇక సినిమాను విడుదల చేయడమే ఆలస్యం. ఈ సినిమా గురించి నిర్మాత సురేష్ దూడల మాట్లాడుతూ...'ఈ సినిమా కేవలం శృతి అభిమానుల కోసం మాత్రమే కాదు...యాక్షన్ ఓరియెంటెడ్ సినిమాలు ఇష్టపడే అందరికీ ఈ చిత్రం బాగా నచ్చుతుంది' అన్నారు.

  ఈ చిత్రంలో శృతి హాసన్ కరాచీకి చెందిన వేశ్య పాత్రలో నటించింది. 'సినిమాలో శృతి హాసన్ బోల్డ్ పెర్ఫార్మెన్స్ సినిమాకు హైలెట్. ఆమె నటించిన హాట్ సీన్లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తాయి. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తుందని భావిస్తున్నాను. డబ్బింగగ్ పనులు పూర్తయ్యాయి. త్వరలో విడుదల చేస్తామని సురేస్ దూడల తెలిపారు. సినిమాకు సంబంధించిన శృతి హాసన్ హాట్ సీన్లు స్లైడ్ షోలో....

  యాక్షన్ స్పై థ్రిల్లర్

  యాక్షన్ స్పై థ్రిల్లర్

  డి-డే అనేది ఒక యాక్షన్ స్పై థ్రిల్లర్. ఈ చిత్రానికి నికిల్ అద్వానీ దర్శకత్వం వహించారు. దార్ మోషన్ పిక్చర్స్, ఎమ్మీ ఎంటర్టెన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించారు.

  డి-డే స్టోరీ

  డి-డే స్టోరీ

  ఈ చిత్రానికి రితేష్ షా, సురేష్ నాయర్ కథ అందించారు. అద్భుతమైన కథాంశంతో సినిమా తెరకెక్కిందని నిర్మాతలు అంటున్నారు.

  దావూద్ ఇబ్రహీం గురించా?

  దావూద్ ఇబ్రహీం గురించా?

  డి-డే చిత్రం దావూద్ ఇబ్రహీం గురించి అనే ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే దర్శకుడు నిఖిల్ అద్వానీ ఈ వార్తలను ఖండించారు.

  ముఖ్య తారాగణం

  ముఖ్య తారాగణం

  అర్జున్ రాంపాల్, రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సందీప్ కులకర్ణి ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.

  ఇద్దరు హీరోయిన్లు

  ఇద్దరు హీరోయిన్లు

  ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించారు. ఒకరు శృతి హాసన్ కాగా...మరొకరు హుమా ఖురేషి. హుమా ఖురేషి ఈ చిత్రంలో భారతీ గూడచార సంస్థ‘ఆర్.ఏ.డబ్బు'కు చెందిన పేలుడు పదార్థాల నిపుణురాలుగా నటించింది.

  శృతి హాసన్ రోల్, పెర్ఫార్మెన్స్

  శృతి హాసన్ రోల్, పెర్ఫార్మెన్స్

  ఈ చిత్రంలో శృతి హాసన్ కరాచీకి చెందిన వేశ్య పాత్రలో నటించింది. ఈ చిత్రంలో ఆమె కనిపించేది కొంత సేపు మాత్రమే. కనిపించేది తక్కువ సమయమే అయినా...బ్రిలియంట్, బోల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఆమె నటనకు ప్రశంసలు అందాయి.

  అర్జున్ రాంపాల్, శృతి హాసన్

  అర్జున్ రాంపాల్, శృతి హాసన్

  ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, శృతి హాసన్ మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఇద్దరిపై చిత్రీకరించిన శృంగార సన్నివేశాలు సినిమాకు హైలెట్.

  సినిమాకు హైప్ తెచ్చిన సీన్లు

  సినిమాకు హైప్ తెచ్చిన సీన్లు

  శృతి హాసన్, అర్జున్ రాంపాల్ మధ్య వచ్చే హాట్ సన్నివేశాలు సినిమాకు హైప్ తెచ్చాయి. సినిమా హాట్ టాపిక్ కావడానికి ఇద్దరి మధ్య జరిగే సెక్స్ సీన్లే కారణం.

  తరణ్ ఆదర్శ్

  తరణ్ ఆదర్శ్

  శృతి హాసన్ పెర్ఫార్మెన్స్ గురించి సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ మాట్లాడుతూ ప్రశంసల వర్సం కురిపించారు. శృంగార సన్నివేశాల్లో శృతి హాసన్ అదరగొట్టిందని తెలిపారు.

  వేశ్య పాత్రలో...

  వేశ్య పాత్రలో...

  వేశ్య పాత్రలో శృతి హాసన్ పెర్ఫార్మెన్స్ చాలా రియల్‌గా ఉందని మరో సినీ విమర్శకులు పలోమా శర్మ పేర్కొన్నారు.

  శృతి హాసన్ గ్లామర్ కేక

  శృతి హాసన్ గ్లామర్ కేక

  సినిమాలో శృతి హాసన్ గ్లామర్ మరే సినిమాలోనూ లేని విధంగా అదిరిపోయిందని పలువురు ప్రశంసించారు.

  డి-డే కు పాజిటివ్ రివ్యూలు

  డి-డే కు పాజిటివ్ రివ్యూలు

  డి-డే సినిమాకు రివ్యూలు పాజిటివ్‌గా వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలుగులోనూ మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు.

  డి-డే బాక్సాఫీసు

  డి-డే బాక్సాఫీసు

  గతేడాది జులైలో విడుదలైన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద పెద్దగా ఓపెనింగ్స్ సాధించలేదు. అయితే తర్వాత రోజుల్లో పుంచుకుంది. ఓవరాల్‌గా ఈ చిత్రం యావరేజ్ కలెక్షన్లు సాధించింది.

  తెలుగు ఆడియన్స్‌కు నచ్చుతుందా?

  తెలుగు ఆడియన్స్‌కు నచ్చుతుందా?

  డి-డే చిత్రం తెలుగు ఆడియన్స్‌కు నచ్చుతుందా? అంటే ఇప్పుడే చెప్పడం కష్టం. కేవలం సినిమా శృతి హాసన్ హాట్ ఇమేజ్‌తోనే విడుదలవుతోంది. బాక్సాఫీసు వద్ద ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి.

  తమిళంలో కూడా..

  తమిళంలో కూడా..

  డి-డే చిత్రాన్ని కేవలం తెలుగులో మాత్రమే కాదు...తమిళంలోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

  English summary
  Popular Telugu actress Shruti Hassan has delivered a very bold performance in her last Hindi film D-Day, which has got her lot of accolades. The makers have planned to dub it in Telugu in a bid to cash in on her glamour quotient in the film. Suresh Doodala, who has bought the dubbing rights of its Telugu version, has pinned lot of hopes on the film. Titled Gelupu Gurram, the movie will release in theatres soon.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more