గబ్బర్ సింగులో...శృతి హాసన్ కు అదే మైనస్
గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ ప్రేయసి పాత్రలో శృతి హాసన్ నటించిన విషయం తెలిసిందే. అయితే ఈచిత్రంలో శృతి హాసన్ పాత్రకు తగిన ప్రాధాన్యత లేదనే చెప్పాలి. దబంగ్ చిత్రంలో సోనాక్షి సిన్హాకు ఉన్నంత షో శృతి హాసన్ కు గబ్బర్ సింగ్ లో లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరో వైపు ఆమెకు డబ్బింగ్ కూడా సూటవ్వ లేదని అంటున్నారు. అయితే పెర్ఫార్మెన్స్ పరంగా మాత్రం శృతి హాసన్ ఉన్నంతలో బాగా చేసిందని అంటున్నారు.
ఈ మైనస్ పాయింట్ల నేపథ్యంలో గబ్బర్ సింగ్ చిత్రంపై బోలెడు ఆశలు పెట్టుకున్న శృతి హాసన్....కాస్త నిరాశకు లోనుకాక తప్పదని స్పష్టమవుతోంది. ఆమెకు ఎక్కువ మార్కులు పడి ఉంటే ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా వచ్చేది. కానీ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. అయితే తను నటించిన సినిమాల పరంగా చూస్తే ఈ చిత్రం ఆమె సినీ కెరీర్లో అతిపెద్ద హిట్ గబ్బర్ సింగే.
గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. మలైకా అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాభీభట్ల ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ : జైనన్ విన్సెంట్, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్ : బ్రహ్మ కడలి, ఎడిటింగ్ : గౌతం రాజు, స్ర్కీన్ ప్లే : రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్ : దినేష్, గణేష్, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్ : డి. బ్రహ్మానందం, సమర్పణ : శివబాబు బండ్ల, నిర్మాత : బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం : హరీష్ శంకర్


Click it and Unblock the Notifications











