పవన్ తో 'గబ్బర్ సింగ్' అంటే చాలా భయమేసింది...!?
శృతి హాసన్.... తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా 'గబ్బర్ సింగ్" నుంచి తొలగింపబడిందని, ఆమె స్థానంలో ఇలియానాను హీరోయిన్ తీసుకున్నారని పుకార్లు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను గబ్బర్ సింగ్ చిత్ర దర్శకుడు హారిష్ శంకర్ ఖండించారు. శృతి హాసన్ గబ్బర్ సింగ్ లో నటిస్తోందని చెప్పారు. ఓ మై ఫ్రెండ్ సినిమా ద్వారా తొలిసారిగా తెలుగులో ఓ విజయాన్ని రుచి చూసిన శృతి...గబ్బర్ సింగ్ సినిమా పై భారీ ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం ఆమె తమిళ, తెలుగు చిత్రాలతో బిజీగా గడుపుతోంది. పవన్ తో నటించడం చాలా ఆనందంగా ఉందని శృతి చెబుతోంది. ఇందులో తన పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందనీ, కథ బాగా నచ్చిందని త్వరలో ఆ వివరాలు తెలియజేస్తానంది. పవన్ చిత్రమంటే చాలామంది భయపెట్టారనీ, కానీ ఆయన్ను కలిసినప్పుడు చాలా విషయాల్లో ఖచ్చితంగా ఉన్నారనీ, అలాంటివారితో ఇబ్బందులు ఏమీ రావని తేల్చి చెబుతోంది.
పవన్ కళ్యాణ్ 'పంజా" చిత్రం దాదాపుగా పూర్తి కావడంతో చురుగ్గా 'గబ్బర్ సింగ్" షూటింగ్ లో పాల్గొంటున్నాడు. రికార్డుస్థాయిలో కేవలం 60రోజుల్లో షూటింగ్ ని పూర్తి కానున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే మూడు పాటలకు అదిరిపోయే ట్యూన్స్ ని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సిద్ధం చేశాడట. ఈ చిత్రంలో పార్వతీమెల్టన్ మున్నీగా చిందులేయబోతుంది. దబాంగ్ లో నటించిన వినోద్ ఖన్నా, డింపుల్ కపాడియాల పాత్రల్లో నాగినీడు, సుహాసిని నటించనున్నారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే భారీ అంచనాల ఏర్పడ్డ ఈ చిత్రాన్ని 2012ఏప్రిల్ 20న విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











