భారీ ఆఫర్ చేజిక్కించుకున్న శృతి హాసన్
ముంబై : గబ్బర్ సింగ్ విజయంతో తన మీద ఉన్న ఐరన్ లెగ్ ఇమేజ్ ని తుడిచేసుకున్న శ్రుతి హాసన్ వరస ఆఫర్స్ తో దూసుకుపోతోంది. తాజాగా ఆమె నిఖిల్ అద్వానీ తీయబోయే 'డి డే' సినిమాలోనూ నటించేందుకు అంగీకరించింది. 21 నుంచి ముంబయిలో షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ఇందులో అర్జున్ రామ్‌పాల్ సరసన శ్రుతి కనిపించబోతోంది. ఇప్పటికే ప్రభుదేవా రూపొందిస్తున్న ఓ చిత్రంలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది
ఇక శృతి మూడేళ్ల కిందట 'లక్' చిత్రంతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. దర్శకుడు సోహమ్ షా ఆమెను పరిచయం చేశారు. అయితే హిట్ దక్కలేదు. తరవాత మధుర్ బండార్కర్ రూపొందించిన 'దిల్ తో బచ్చా హై జీ' సినిమాలో ఓ హీరోయిన్ గా చేసింది. అయితే అది కూడా ఆమెకు నిరాశను మిగిల్చింది. దీంతో హిందీ సినిమాల వైపు చూడకుండా దక్షిణాదిన తన అదృష్టాన్ని పరీక్షించుకొంది. ఇటీవలే 'గబ్బర్ సింగ్'తో విజయాన్ని అందుకున్న ఈ భామ ఇప్పుడు హిందీలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.
'గబ్బర్ సింగ్' చిత్రం తర్వాత హీరోయిన్ శృతి హాసన్‌కు అవకాశాలు బాగానే వస్తాయని ఆశించారంతా. అయితే అంచనాలు తలక్రిందులయ్యాయి. ఈ హిట్ ఆమె కెరీర్‌కి పెద్దగా ప్లస్సవ్వలేదనే చెప్పాలి. కారణం ఈ చిత్రంలో శృతి హాసన్ పాత్ర కేవలం పాటలకు మాత్రమే పరిమితం కావడం. దీంతో యాక్టింగ్‌కు స్కోప్ లేకుండా పోయింది.
తాజాగా శృతి హాసన్ నాగచైతన్య సరసన హీరోయిన్‍గా ఎంపికైంది. వీరూ పొట్ల దర్శకత్వంలో ఈచిత్రం రూపొందనుంది. త్వరలో దీనిపై అధికారిక సమాచారం వెలువడనుంది. యాక్షన్ తో కూడిన రొమాంటిక్ కామిడీ అంశాలతో రూపొందే ఈ చిత్రం అక్టోబర్లో ప్రారంభం కానుంది. రగడ చిత్రం నిర్మించిన కామాక్షి కళా మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందనుంది. రగడ చిత్రంలో తనను స్టైలిష్ గా చూపించటంతో నాగార్జున మెచ్చుకుని ప్రత్యేకంగా వీరు పోట్లను పిలిచి ఈ చిత్రం అప్పచెప్పినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











