హైదరాబాద్‌కు మకాం మారుస్తున్న శృతి

By Bojja Kumar

 Shruti Hassan to shift her home to Hyderabad
హీరోయిన్ శృతి హాసన్ త్వరలో హైదరాబాద్ కు మకాం మారుస్తోంది. ఇందు కోసం ఇప్పటి నుంచే హైదరాబాద్ లో ఓ మంచి ఇంటిని వెతికే ప్రయత్నం మొదలు పెట్టింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. హైదరాబాద్ నాకు చాలా ఇస్టమైన ప్రదేశమని, దేశంలోని అందనమైన నగరాల్లో హైదరాబాద్ ఒకటి అని తెగ పొగిడేస్తోంది. ఓ మై ఫ్రెండ్ సినిమా ద్వారా తెలుగులో తొలిసారిగా ఓ మంచి విజయం సొంతం చేసుకున్న శృతి, ఇక్కడ మరింతగా రాణించడానికి తన వంతు ప్రయత్నం చేస్తోంది. శృతి హాసన్ ప్రస్తుతం పవన్ కళ్యాన్ తో కలిసి గబ్బర్ సింగ్ అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమె ఓ పల్లెటూరి యువతి పాత్రను పోషిస్తోంది. శృతి కెరీర్ లో ఇలాంటి పాత్రను పోషించడం ఇదే తొలిసారి. ఈ సినిమా 2012 ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరో వైపు తమిళంలో '3" అనే చిత్రంలో ధనుష్ సరసన నటిస్తోంది. ఈ చిత్రానికి రజనీకూతురు ఐశ్వర్య దర్శకత్వం వహిస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన దమ్ము చిత్రంలో నటించడానికి తొలుత ఓకే చెప్పిన శృతి అర్ధాంతరంగా ఆ సినిమా నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X