ఎన్టీఆర్ సినిమాలో ఆమె గెస్ట్ రోల్ మాత్రమే...
హైదరాబాద్ : ఎన్టీఆర్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటించేందుకు శ్రుతిహాసన్ అంగీకరించిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను శ్రుతి ఖండించింది. తాను కేవలం ఈ చిత్రంలో గెస్ట్ రోల్ లో మాత్రమే కనిపిస్తానని క్లియర్ చేసింది. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన మీడియాకు విడుదల చేసారు.
ఆ ప్రకటనలో..."గతంలో ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయాల్సింది. కానీ కాల్షీట్ కుదర్లేదు. ఇప్పుడు ఎన్టీఆర్, హరీష్‌శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నాను. అది సెకండ్ హీరోయిన్ పాత్ర కాదు. కేవలం స్పెషల్ అప్పియరెన్స్'' మాత్రమే అని వివరించారు శ్రుతిహాసన్.
"హరీష్ దర్శకత్వంలో 'గబ్బర్‌సింగ్'లో చేసిన భాగ్యలక్ష్మి పాత్రకు సర్వత్రా ప్రశంసలు దక్కాయి. నా కెరీర్‌లో ఆ పాత్ర గొప్ప టర్నింగ్ పాయింట్ అయింది. ఎన్టీఆర్ సినిమాలో కూడా ప్రత్యేక పాత్ర నేను చేస్తేనే బావుంటుందని హరీష్ చెప్పడంతో చేయడానికి ఒప్పుకున్నాను. ప్రస్తుతం రామ్‌చరణ్ 'ఎవడు', రవితేజ 'బలుపు'లోనూ చేస్తున్నాను. మరో రెండు సినిమాలు కూడా చర్చల్లో ఉన్నాయి'' అని ఆ ప్రకటనలో శ్రుతి హాసన్ తెలిపారు.
అలాగే ''ప్రేక్షకుల్ని మెప్పించే పాత్రల్లో నటించినప్పుడే ఆనందం. 'గబ్బర్‌సింగ్' సినిమాతో ఆ విషయం నాకు అనుభవమైంది. ఈ యేడాది ఐదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తాను. తొలినాళ్లలో తెరపై నేనెలా కనిపిస్తే బాగుంటుంది? అని ఆలోచించుకొనేదాన్ని. ఇప్పుడలా కాదు, నేనెలా కనిపిస్తే ప్రేక్షకులకు నచ్చుతుంది? అని ఆరా తీస్తున్నా. నాలో వచ్చిన కీలకమైన మార్పు ఇదే. ప్రతి సినిమాతోనూ ఓ కొత్త పాఠాన్ని నేర్చుకొంటున్నా''ని చెప్పుకొచ్చింది శ్రుతిహాసన్.


Click it and Unblock the Notifications











