'ఎవడు' ఎలా ఉందో జేమ్స్ స్పేడర్ చెప్పాలి
హైదరాబాద్ : 'నా సినిమా చూసి ఫ్యాన్స్, ప్రెండ్స్ తమ అభినందనల్ని ట్విట్టర్ ద్వారా తెలియజేస్తున్నారు. వారి వ్యాఖ్యలు చదువుతోంటే చాలా ఆనందంగా ఉంటోంది. అయితే నా సినిమాలు చూసి ఓ వ్యక్తి తన అభిప్రాయం చెప్పాలని కోరుకుంటున్నాను. అతనెవరో కాదు.. హాలీవుడ్ నటుడు జేమ్స్ స్పేడర్'' అంటోంది శ్రుతిహాసన్. శ్రుతిహాసన్ హీరోయిన్ గా చేసిన 'ఎవడు' నిన్న (ఆదివారం) ప్రేక్షకుల ముందుకొచ్చింది. దీంతో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమెకు ట్విట్టర్‌లో సందేశాలొచ్చాయి.
శ్రుతి స్పందిస్తూ ''నన్ను అభినందిస్తూ ప్రోత్సహించిన వారందరికీ నా కృతజ్ఞతలు, అయితే నా నటన చూసి ఎలా ఉందనేది జేమ్స్ స్పేడర్ చెప్పాలనేది ఎప్పటి నుంచో నా కోరిక. ఆయన చెప్తే ఆ ఆనందమే వేరు'' అని ట్వీట్ చేసింది శ్రుతిహాసన్. సోషల్ నెట్ వర్కింగ్ వినియోగం పెరిగాక అభిమానులకు సినీజనాలకు దూరం బాగా తగ్గిపోయింది. పుట్టినరోజు, సినిమా విడుదల ఏదైనా వస్తోందంటే చాలు ఆ తారల ట్విట్టర్, ఫేస్‌బుక్ వాల్స్ అభిమానుల వ్యాఖ్యలతో నిండిపోతున్నాయి.

రామ్‌చరణ్ హీరోగా నటించిన సినిమా 'ఎవడు'. శ్రుతిహాసన్, ఎమిజాక్సన్ హీరోయిన్స్. అల్లు అర్జున్, కాజల్ అతిథి పాత్రల్లో నటించారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. దిల్‌రాజు నిర్మించారు. శిరీష్, లక్ష్మణ్ సహ నిర్మాతలు. జనవరి 12న విడుదల అయిన ఈ చిత్రం కమర్షియల్ గా మంచి విజయం సాధిస్తుందని ట్రేడ్ లో వినపడుతోంది. ఎక్కడా నెగిటివ్ టాక్ లేకుండా ముందుకు వెళ్తున్న ఈ చిత్రం కలెక్షన్స్ పరంగానూ అందరికీ ఆనందం కలిగిస్తుందంటున్నారు.
నటీనటులు: రామ్ చరణ్, అల్లు అర్జున్, అమీ జాక్సన్, కాజల్, శృతి హాసన్, జయసుధ, కోటా శ్రీనివాసరావు, రాహుల్ దేవ్, సాయి కుమార్, అజయ్, ఎల్బీ శ్రీరామ్, సుప్రీత్, వెన్నెల కిషోర్ తదితరులు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కథ: వంశీ పైడిపల్లి, వక్కతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, కథ సహకారం: హరి, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, యాక్షన్ : సెల్వం, ఆర్ట్: ఆనంద్ సాయి,
సహనిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత: దిల్ రాజు, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.


Click it and Unblock the Notifications











