వరుస దాడులు: శృతి హాసన్‌కు ప్రత్యేక భద్రత

By Bojja Kumar

హైదరాబాద్: గత సంవత్సరం ముంబైలో ఓ అగంతక వ్యక్తి శృతి హాసన్ ఉంటున్న అపార్టుమెంట్లోకి చొరబడి ఆమెపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నుండి చాక చక్యంగా తప్పించుకుంది శృతి హాసన్. తాజాగా మరోసారి ఇలాంటి సంఘటనే చోటు చేసుకుంది. ఇటీవల డెహ్రాడూన్‌లోని హోటల్లో బస చేసిన శృతిహాసన్ గది తలుపు తట్టి ఒక తాగుబోతు అల్లరి చేసే ప్రయత్నం చేశాడు.

అతనిపై శృతి హాసన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి అల్లరోళ్ల చిల్లర ప్రవర్తనతో శృతి భయభ్రాంతులకు గురవుతున్నారు. దీంతో ఆమెకు ప్రత్యేక భద్రత అవసరం అయ్యింది. ప్రస్తుతం శృతిహాసన్ తమిళంలో విశాల్ సరసన పూజై చిత్రంతోపాటు హిందీలో యారా అనే చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్ ప్రాంతాల్లో శృతికి ప్రత్యేక రక్షణ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆమె షూటింగ్ ముగించుకుని హోటల్ రూమ్‌కు వెళ్లే వరకు ఆమె వెంట సెక్యూరిటీ సిబ్బంది వెలుతున్నారు.

Shruti Hassan under security

శృతి హాసన్ సినిమాలకు సంబంధించిన విషయాల్లోకి వెళితే....మహేష్ బాబు తాజా చిత్రం 'ఆగడు' లో వీలైనన్ని సర్పైజ్ లు నింపటానికి ప్రయత్నిస్తున్న దర్శకుడు శ్రీను వైట్ల ఈ చిత్రంలో ఐటం సాంగ్‌‍కు శృతిహాసన్‌ను ఒప్పించారు. దీంతో పాటు ఆమె తమిళంలో 'పూజై', హిందీలో 'వెల్ కం బ్యాక్', 'గబ్బర్', 'యారా' చిత్రాల్లో నటిస్తోంది.

శృతి హాసన్ బాలీవుడ్ మూవీ 'డి-డే'లో హాట్ అండ్ సెక్సీ పెర్ఫార్మెన్స్‌తో రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శృతి హాసన్ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌తో కలిసి శృంగార భంగిమల్లో నటించడం అప్పట్లో ఓ సెన్సేషన్. తాజాగా ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం నిర్మాత సురేష్ దూడల తెలుగు డబ్బింగ్ రైట్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. తెలుగులో ఈచిత్రాన్ని 'గెలుపు గుర్రం' పేరుతో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శృతి హాసన్ నటించడం, హాట్ హాట్ సీన్లు ఉండటంతో ఇక్కడ మంచి వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X