నాగచైతన్యతో శృతి హాసన్ రొమాన్స్
హైదరాబాద్: 'గబ్బర్ సింగ్' చిత్రం తర్వాత హీరోయిన్ శృతి హాసన్‌కు అవకాశాలు బాగానే వస్తాయని ఆశించారంతా. అయితే అంచనాలు తలక్రిందులయ్యాయి. ఈ హిట్ ఆమె కెరీర్‌కి పెద్దగా ప్లస్సవ్వలేదనే చెప్పాలి. కారణం ఈ చిత్రంలో శృతి హాసన్ పాత్ర కేవలం పాటలకు మాత్రమే పరిమితం కావడం. దీంతో యాక్టింగ్‌కు స్కోప్ లేకుండా పోయింది.
తాజాగా శృతి హాసన్ నాగచైతన్య సరసన హీరోయిన్‍గా ఎంపికైంది. వీరూ పొట్ల దర్శకత్వంలో ఈచిత్రం రూపొందనుంది. త్వరలో దీనిపై అధికారిక సమాచారం వెలువడనుంది. యాక్షన్ తో కూడిన రొమాంటిక్ కామిడీ అంశాలతో రూపొందే ఈ చిత్రం అక్టోబర్లో ప్రారంభం కానుంది. రగడ చిత్రం నిర్మించిన కామాక్షి కళా మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందనుంది. రగడ చిత్రంలో తనను స్టైలిష్ గా చూపించటంతో నాగార్జున మెచ్చుకుని ప్రత్యేకంగా వీరు పోట్లను పిలిచి ఈ చిత్రం అప్పచెప్పినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం చైతన్య దేవా కట్ట దర్శకత్వంలో 'ఆటోనగర్ సూర్య' చిత్రం చేస్తున్నాడు. మరో వైపు వెట్టైకి రీమేక్‌గా తెలుగులో రూపొందుతున్న 'భలే తమ్ముడు' చిత్రానికి కూడా కమిట్ అయ్యాడు. దడ, బెజవాడ చిత్రాలతో వరుస ఫెయిల్యూర్స్ చవి చూసిన నాగచైతన్య ఈ చిత్రాలపై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు.


Click it and Unblock the Notifications











