గబ్బర్ సింగ్, ఎవడు సేమ్ ఫీలింగ్ (శృతిహాసన్ ప్రెస్ మీట్)

By Bojja Kumar

హైదరాబాద్: దర్శకుడు వంశీ 'ఎవడు' కథ చెప్పగానే బాగా నచ్చింది. హిట్టవుతుందని అనిపించింది. 'గబ్బర్ సింగ్' సినిమా కథ విన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో 'ఎవడు' సినిమా కథ విన్నప్పుడు కూడా అలాంటి ఫీలింగే కలిగింది....ఊహించినట్లుగానే ఈ రెండు చిత్రాలు భారీ విజయం సాధించాయని హీరోయిన్ శృతిహాసన్ చెప్పింది.

నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లితో కలిసి మంగళవారం జరిగిన ఎవడు సక్సెస్ మీట్లో శృతిహాసన్ మాల్గొన్నారు. 'ఎవడు' సినిమా పెద్ద విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది, ప్రతి ఒక్క టెక్నీషియన్, నటుడు కష్టపడి పని చేసారు. బన్నీ, రాంచరణ్ కలిసి నటించిన సినిమాలో నాకు ఒక మంచి పాత్ర ఇచ్చినందుకు దర్శకుడికి థాంక్స్. దిల్ రాజు బ్యానర్లో ఇది మూడో సినిమా. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్టయినందుకు చాలా సంతోషంగా ఉందని శృతిహాసన్ చెప్పుకొచ్చింది.

రామ్ చరణ్ చాలా ఫ్రెండ్లీ కో స్టార్. డౌన్ టు ఎర్త్ ఉన్న నటుడు. అతనితో కలిసి పని చేయడం హ్యాపీగా ఫీలవుతున్నాను అని శృతిహాసన్ తెలిపింది. మరిన్ని వివరాలు స్లైడ్ షోలో...

వంశీ పైడిపల్లి

వంశీ పైడిపల్లి


దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ...శృతిహాసన్ మంచి కమిట్మెంట్ ఉన్న హీరోయిన్. ప్రమోషన్లో భాగంగా హెల్త్ బాగోలేకున్నా వచ్చి పాల్గొంది. తర్వాతే హాస్పిటల్ లో జాయినైంది. సినిమా కోసం ఆమె చాలా కష్టపడింది. ఆమె నటన సినిమాకు బాగా ప్లస్సయింది అన్నారు.

దిల్ రాజు మాట్లాడుతూ...

దిల్ రాజు మాట్లాడుతూ...


వంశీ కథ చెప్పినపుడే హిట్టవుతుందనే నమ్మకం ఏర్పడింది. సినిమా రిలీజ్ అయ్యే వరుఃకు టెన్షన్ పడ్డాం. మా నమ్మకాన్ని సినిమా నిలబెట్టింది. ఈ సినిమా విజయం మా కష్టాన్నంతా మరిచిపోయేలా చేసింది. రెండో వారంలో కూడా సినిమా విజయం వంతంగా నడుస్తోంది అన్నారు.

మలయాళంలో కూడా...

మలయాళంలో కూడా...


ఎవడు చిత్రాన్ని మలయాళంలో కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మలయాళ వెర్షన్ కు ‘భయ్యా' అనే టైటిల్ పెట్టారు బ్రదర్ అనేది ట్యాగ్ లైన్. కె.మంజు అనే నిర్మాత ఈ చిత్రం రైట్స్ తీసుకున్నారు. మొదట ఈ చిత్రం జనవరి 24 న విడుదల అనుకున్నారు కానీ ఇప్పుడది జనవరి 31 కి వాయిదా వేసారు.

అమీ జాక్సన్ మాట్లాడుతూ..

అమీ జాక్సన్ మాట్లాడుతూ..


‘రామ్ చరణ్ సరసన నటించే అవకాశం దక్కడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ సూపర్బ్. ఇక డాన్సులైతే ఇరగదీసాడు. అలాంటి గ్రేట్ డాన్సర్‌తో కలిసి స్టెప్పులేసే అవకాశం దక్కింది. అతను నిజంగా రియల్ స్టార్. రామ్ చరణ్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయనతో కలిసి పని చేయడం వల్ల నాకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది' అని చెప్పుకొచ్చింది అమీ జాక్సన్.

ఎవడు

ఎవడు


రామ్ చరణ్, శృతి హాసన్, అమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ‘ఎవడు' చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో భారీ బడ్జెట్‌తో నిర్మించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు రాబడుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X