కమల్ హాసన్ రెండో కూతురు సినిమా ప్రవేశం...
కమల్ హాసన్, సారిక ల రెండో కూతురు అక్షర తాజాగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. శృతి హాసన్ సోదరి అయిన ఈమె నటిగా కాకుండా దర్శకురాలుగా ఎదగాలి అనుకుంటోంది. అందుకు తగినట్లుగానే ఆమె తన తల్లి సారిక చేస్తున్న సొసైటీ అనే చిత్రానికి అసెస్టెంట్ డైరక్టర్ గా పనిచేస్తేంది. రాహుల్ ధోలాకియా అనే దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రంలో మొదట తన తల్లికి ఆఫర్ రాగానే సంతోషపడింది. ఆ తర్వాత ఆ దర్శకుడు పనితీరు చూసి సారికతో తాను ఆ సినిమాకు దర్శకత్వ విభాగంలో చేస్తానని అడగటం జరిగింది. వెంటనే ఆమె డైరక్టర్ ని అడగటం, ఆమె డైరక్షన్ డిపార్ట్ మెంట్ లో చేరిపోవటం జరిగిపోయాయి. ఇక ఈ చిత్రంలో డింపుల్ కపాడియా, సారిక, జావిద్ జాప్రీ ప్రధాన పాత్రలు చేస్తున్నారు. ఇక శృతిహాసన్ తెలుగులో సిద్దార్ధ సరసన రాఘవేంద్రరావు కుమారుడు సూర్య ప్రకాశరావు డైరక్షన్ లో రూపొందుతున్న సోషియో ఫాంటసీ చిత్రంలో చేస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











