శృతి పవన్ కళ్యాణ్ తోనే : పుకార్లను ఖండించి దర్శకుడు
'దమ్ము" చిత్రం నుంచి వైదొలగి జూనియర్ ఎన్టీఆర్ కు షాక్ ఇచ్చిన శృతి హాసన్.... తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా 'గబ్బర్ సింగ్" నుంచి తొలగింపబడిందని, ఆమె స్థానంలో ఇలియానాను హీరోయిన్ తీసుకున్నారని పుకార్లు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను గబ్బర్ సింగ్ చిత్ర దర్శకుడు హారిష్ శంకర్ ఖండించారు. శృతి హాసన్ గబ్బర్ సింగ్ లో నటిస్తోందని, ఆమె ఈ సినిమా చేయడం లేదని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. శృతి హాసన్ డిసెంబర్ లో గబ్బర్ సింగ్ షూటింగులో జాయిన్ అవుతుందని, ఆమె పవన్ కళ్యాన్ తో కలిసి నటించడం పట్ల చాలా ఎక్సైటెడ్ గా ఉందని హారిష్ శంకర్ పేర్కొన్నారు.
ఓ మై ఫ్రెండ్ సినిమా ద్వారా తొలిసారిగా తెలుగులో ఓ విజయాన్ని రుచి చూసిన శృతి...గబ్బర్ సింగ్ సినిమా పై భారీ ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం ఆమె తమిళ, తెలుగు చిత్రాలతో బిజీగా గడుపుతోంది. 'గబ్బర్ సింగ్" విడుదల తేదీ దాదాపు ఖరారైంది. ఈ సినిమా ఏప్రిల్ నెల 2012 లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ 'దబాంగ్" కు ఆఫీషియల్ రీమేక్.


Click it and Unblock the Notifications











