For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శృతి హాసన్..సెక్సీగా రెచ్చిపోయింది(వీడియో)

  By Srikanya
  |

  హైదరాబాద్ : శృతిహాసన్ ని ఈ వీడియోలో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. బాలీవుడ్ లో ఆమె సెక్సీగా రెచ్చిపోయిందంటున్నారు. ఆమె తేవర్ చిత్రంలో ఐటం సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందులోది ఓ పాటని అఫీషియల్ గా విడుదల చేసి క్రేజ్ తీసుకువచ్చారు. జనవరి 9న విడుదల అయ్యే ఈ చిత్రంలో మేడా మియా అంటూ ఈ సాగే ఈ ఐటం స్పెషల్ గా కనిపిస్తుందని, డిస్కషన్ గా మారుతుందని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. ఇంతకీ తేవర్ సినిమా మరేదో కాదు...మన తెలగు సినిమా ఒక్కడు కు రీమేక్. మీరూ ఆ పాటని ఓ లుక్కేసి ఎంజాయ్ చెయ్యండి...

  ప్రతీ అమ్మాయి తనని పిచ్చగా ప్రేమించే మేడ్ లవర్ ని కోరుకుంటుంది...మా ఆగ్రా కుర్రాడి కన్నా అలాంటి వాడు ఇంకోడు లేడు అంటూ ఈ పాట సాగుతుంది..

  ఈ పాట షూటింగ్ లో ప్రమాదం..

  అర్జున్ కపూర్, సోనాక్షీ సిన్హా జంటగా 'ఒక్కడు' హిందీ రీమేక్ 'తేవర్' రూపొందుతోంది. ఈ చిత్రంలోని ఒక ప్రత్యేక పాటను శ్రుతీహాసన్ పాడారు. అది మాత్రమే కాదు.. ఈ పాటకు అర్జున్ కపూర్‌తో కలిసి కాలు కదిపారామె. ఈ పాటకు సంబంధించిన ఓ సన్నివేశంలో గుర్రాలు కూడా ఉన్నాయి. ఆ సన్నివేశం చిత్రీకరణకు సంబంధించిన విరామంలో శ్రుతీహాసన్ రిలాక్స్ అవుతున్నారు.

  కళ్లు మూసుకుని హాయిగా రిలాక్స్ అవుతున్న శ్రుతి తనకు జరగబోతున్న ప్రమాదాన్ని పసిగట్టలేకపోయారట. ఓ గుర్రం ముందుకు ఉరుక్కుంటూ వచ్చి, శ్రుతిని కాలితో తన్నబోవడం అర్జున్ కపూర్ దృష్టిలో పడిందట. ఆ గుర్రం కాలు సరిగ్గా శ్రుతి పొట్టవైపు ఉందట. అర్జున్ సకాలంలో శ్రుతిని అక్కణ్ణుంచి పక్కకు లాగడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

  ఊహించని ఈ పరిణామానికి శ్రుతీహాసన్ కంగారు పడినా, ప్రమాదం తప్పినందుకు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, కాపాడినందుకు తనతో పార్టీకి రమ్మని శ్రుతిని ఆహ్వానించారట అర్జున్. వరుణ్ ధావన్ హీరోగా రూపొందుతున్న 'బద్లాపూర్' చిత్రం షూటింగ్ ముగియడంతో ఆ చిత్రబృందం 'ర్యాప్ అప్ పార్టీ' ఏర్పాటు చేశారట. ఆ పార్టీకి ఆహ్వానం అందుకున్న అర్జున్‌కపూర్ తనతో పాటు శ్రుతిని కూడా తీసుకెళ్లారని బాలీవుడ్ టాక్.

  Shruti’s Madamiyan treat is here

  మహేష్‌ బాబు సూపర్ హిట్‌ 'ఒక్కడు (2003) ని హిందీలో తేవర్ టైటిల్ తో బోనీ కపూర్‌ రీమేక్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందీలో మహేష్‌ బాబు పాత్రను బోనీకపూర్‌ తనయుడు అర్జున్‌ కపూర్‌ పోషిస్తున్నాడు. సంజయ్ కపూర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బోనీ కపూర్ నిర్మిస్తున్నారు. మొదట అభిషేక్ బచ్చన్ తో ఈ చిత్రం రీమేక్ అనుకున్నారు కానీ మెటీరియలైజ్ కాలేదు. ప్రస్తుతం ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వస్తోంది. ఇక సినిమా రిలీజయ్యక ..మహేష్ ని మరిపిస్తాడా లేదా అనేది ఈ సినిమాకు సంభందించి మరో ఆసక్తికరం అంశం అంటున్నారు.

  ఈ చిత్రంలో మదామియా అంటూ శృతిహాసన్ ఈ రీతిలో అందాలు తెరపై ఒలకపోసింది. ఈ పాట సినిమాలో హైలెట్ గా నిలుస్తుందని చెప్తున్నారు. ఖచ్చితంగా బాలీవుడ్ ఐటం సాంగ్ లలో ఒకటిగా ఉండిపోతుందని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.

  'తేవర్'లో ఆగ్రాకు చెందిన కబడ్డీ ఛాంపియన్ అయిన కాలేజీ కుర్రాడిగా కనిపించనున్నాడు అర్జున్. బోనీ కపూర్‌ ఈ విషయమై మాట్లాడుతూ.. ''అవును. 'ఒక్కడు ప్రాజెక్టుపై పనిచేస్తున్నాం. అర్జున్‌ ప్రధాన పాత్ర పోషించాడు, తమిళ, కన్నడ భాషల్లోకూడా రీమేక్‌ చేసిన ఈ చిత్రం హిందీలో తీయదగ్గ సతా గల చిత్రమని అర్జున్‌ భావిస్తున్నాడు.

  తెలుగు 'ఒక్కడులో మహేష్‌ బాబు సరసన నటించిన భూమిక చావ్లా మాట్లాడుతూ ''ఎన్నో దక్షిణాది సినిమాలు హిందీలో రీమేక్‌ అయ్యాయి. కానీ ఈ చిత్రం రీమేక్‌ అవ్ఞతుండటం ఎంతో ఆనందంగా ఉంది అంది. ఇప్పటికే అర్జున్ కపూర్ 'ఇషక్‌ జాదే' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టాడు. ఒక్కడు చిత్రంలో మహేష్ బాబు పోషించిన పాత్ర అర్జున్‌కు కరెక్ట్ గా సూటవుతుందని, అర్జున్ బాడీ లాంగ్వేజ్ ఆ సినిమాకు పర్ ఫెక్ట్ గా ఉంటుందని బాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు. అర్జున్ కపూర్ ప్రముఖ హీరోయిన్ శ్రీదేవి సవితి కొడుకు. బోని కపూర్-మోనా పెళ్లయిన పదేళ్ల తర్వాత విడి పోయారు. వీరి సంతానమే అర్జున్ కపూర్.

  అర్జున్‌ కపూర్‌తో 'తేవర్‌' సినిమా కోసం సోనాక్షి జత కట్టింది. ఈ చిత్రానికి అమిత్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగులో వచ్చిన 'ఒక్కడు'కిది రీమేక్‌. బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. పిల్లలం. పక్కపక్క ఇళ్లలో పెరిగాం. పుట్టినరోజు వేడుకలు, ఇతరత్రా కార్యక్రమాలకు హాజరయ్యేవాళ్లం. కానీ ఏనాడూ అర్జున్‌ కపూర్‌తో నేను సన్నిహితంగా మెలగలేదు. అతను నాకు సోనమ్‌ కపూర్‌ సోదరుడిగానే తెలుసు'' అని చెప్పుకొచ్చింది హిందీ హీరోయిన్ సోనాక్షి సిన్హా.

  ఈ చిత్రం గురించి సోనాక్షి చెబుతూ ''ప్రతి ఒక్కరికి సంబంధించిన సినిమా ఇది. ముఖ్యంగా యువతరం ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూస్తారు. ఈ ప్రేమకథలో నేను విభిన్నమైన పాత్రలో కనిపిస్తాను. ఇంతవరకూ నేను పోషించిన పాత్రలన్నింటికీ భిన్నంగా ఉంటుంది. అర్జున్‌ కపూర్‌ విషయానికొస్తే... ఈ సినిమాతోనే నేను అతనికి బాగా దగ్గరవుతున్నాను. తెలివైనవాడు. బాగా మాట్లాడతాడు. తమాషా చేస్తాడు. అన్నింటికీ మించి అతనిలో మంచి నటుడు ఉన్నాడు. 'తేవర్‌' మా ఇద్దరికీ మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తున్నాను'' అని ముగించింది.

  English summary
  Much awaited item number treat is here. Marking the debut of hot siren Shruti Haasan as a spicy item girl in Bolywood, here comes her song from upcoming Hindi flick Tevar, a remake of Okkadu, which features Arjun Kapoor and Sonakshi Sinha in the leads. Apparently the sizzling item song that features Shruti in a delicious avatar is here as ‘Madamiyan’.Showcasing her regular dance moves, Shruti dazzled in skimpy costumes yet another time. Though the song’s artistic look is minimal, it is her flawless glamour and liquid like dance moves that bring the additional color for the song. Thought it looks more like a south item number, it is a visual treats for audience who like to feast on her spellbinding glamour.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X