మిర్చి ఘాటు : రామ్ హీరోయిన్ ఔట్
సున్నితమైన కుటుంబ కథా చిత్రాల దర్శకుడు 'బొమ్మరిల్లు' భాస్కర్ మరియు ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'ఒంగోలు గిత్త'. శుభ ఫుతేల కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
తాజాగా ఈచిత్రం నుంచి హీరోయిన్ తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొన్ని రోజుల క్రితం ఈచిత్రం షూటింగ్ గుంటూరు మిర్చి యార్డులో జరిగింది. మిరపకాయల ఘాటుకు తట్టుకోలేక హీరోయిన్ శుభ పుతేల అనారోగ్యం పాలైంది. దీంతో వైద్యులు ఆమె రెండు నెలలు రెస్టు తీసుకోమని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆమెకోసం వెయిట్ చేయడం ఇష్టం లేక ఆమె స్థానంలో నిఖిత అనే కొత్త హీరోయిన్‌ను తీసుకోవాలనే ఆలోచనకు వచ్చిరు దర్శక నిర్మాతలు మరియు హీరో.
రామ్ "ఒంగోలు గిత్త" చిత్రానికి జి.వి.ప్రకాష్ సంగీతాన్నందిస్తున్నారు. రామ్ హీరోగా ఇటీవల వచ్చిన ఏందుకంటే ప్రేమంట సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయింది. దీంతో ఒంగోలు గిత్త ఏలాగైనా హిట్ అవ్వాలని తీవ్రంగా కృషి చేస్తున్నాడు. సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.


Click it and Unblock the Notifications












