హీరోతో అక్రమసంభంధం లేదని..హీరోయిన్ ఖండన
'దునియా' సినిమాతో ఒక్కసారిగా కన్నడ పరిశ్రమలో సంచలనం సృష్టించిన హీరో విజయ్ విడాకుల కోసం ఇక్కడి కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. భార్య నాగరత్న వల్ల మనశ్శాంతి కరువైందని అర్జీలో ఆరోపించారు. పూర్తి వివరాల్ని త్వరలోనే మీడియాకు వెల్లడిస్తానని గురువారం చెప్పారు. అయితే విజయ్ వాదనను భార్య నాగరత్న తీవ్రంగా ఖండించారు. ప్రాణం పోయినా విడాకులకు అంగీకరించేది లేదని ఆమె స్పష్టం చేశారు. సంసారంలో చిన్నచిన్న కలతలు సహజమేనన్నారు. వాటిని పరిష్కరించుకుంటానని చెప్పారు.
విజయ్, నాగరత్నకు 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఒక కుమార్తె, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పిల్లల భవిష్యత్తు తనకు ముఖ్యమని ఆమె తెలిపారు. గతంలోనే విజయ్‌కు పెళ్లయిందని, ఆమె వదిలి వెళ్లడంతో తనను ఇష్టపడి వివాహం చేసుకున్నాడని తెలిపారు. సంసారం సుఖంగా కొనసాగుతున్న సమయంలో మూడేళ్ల క్రితం నటి శుభపూంజాను వర్ధమాన నటిని వివాహం చేసుకున్నారని దానికి కూడా అడ్డుచెప్పలేదని అన్నారు.
కత్రిగుప్పలో నిర్మించిన ఇంటి గృహ ప్రవేశం సమయంలో కూడా తనతో పాటు ఆ శుభపూంజా కూడా పూజలు, హోమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఛాయాచిత్రాలు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. 'శుభను వివాహం చేసుకున్నాను. అభ్యంతరం చెప్పకూడదని విజయ్ చేసిన ఆదేశాల్ని పాటించానని' నాగరత్న తెలిపారు. ఇప్పుడిలా విడాకులిస్తానంటూ చెబుతున్నారని వాపోయారు.


Click it and Unblock the Notifications












