twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోతో అక్రమసంభంధం లేదని..హీరోయిన్ ఖండన

    By Srikanya
    |

    బెంగళూరు: విజయ్‌, నాగరత్న కుటుంబ కలహాల్లో తన పేరును ప్రస్తావించడం పట్ల నటి శుభపూంజా విచారం వ్యక్తం చేశారు. రెండేళ్ల నుంచి తాను విజయ్‌తో కనీసం మాట్లాడలేదని స్పష్టం చేశారు. పెళ్లి కావాల్సిన తనను ఈ వివాదంలో చేర్చడం బాధను కల్గిస్తోందని పేర్కొన్నారు. విజయ్ తో తనకు అక్రమ సంభందం ఉందంటూ వార్తలు వస్తూండటం విచారకరమనంటూ ఖండించారు.

    'దునియా' సినిమాతో ఒక్కసారిగా కన్నడ పరిశ్రమలో సంచలనం సృష్టించిన హీరో విజయ్‌ విడాకుల కోసం ఇక్కడి కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. భార్య నాగరత్న వల్ల మనశ్శాంతి కరువైందని అర్జీలో ఆరోపించారు. పూర్తి వివరాల్ని త్వరలోనే మీడియాకు వెల్లడిస్తానని గురువారం చెప్పారు. అయితే విజయ్‌ వాదనను భార్య నాగరత్న తీవ్రంగా ఖండించారు. ప్రాణం పోయినా విడాకులకు అంగీకరించేది లేదని ఆమె స్పష్టం చేశారు. సంసారంలో చిన్నచిన్న కలతలు సహజమేనన్నారు. వాటిని పరిష్కరించుకుంటానని చెప్పారు.

    విజయ్‌, నాగరత్నకు 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి ఒక కుమార్తె, ఇద్దరు కొడుకులు ఉన్నారు. పిల్లల భవిష్యత్తు తనకు ముఖ్యమని ఆమె తెలిపారు. గతంలోనే విజయ్‌కు పెళ్లయిందని, ఆమె వదిలి వెళ్లడంతో తనను ఇష్టపడి వివాహం చేసుకున్నాడని తెలిపారు. సంసారం సుఖంగా కొనసాగుతున్న సమయంలో మూడేళ్ల క్రితం నటి శుభపూంజాను వర్ధమాన నటిని వివాహం చేసుకున్నారని దానికి కూడా అడ్డుచెప్పలేదని అన్నారు.

    కత్రిగుప్పలో నిర్మించిన ఇంటి గృహ ప్రవేశం సమయంలో కూడా తనతో పాటు ఆ శుభపూంజా కూడా పూజలు, హోమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఛాయాచిత్రాలు కూడా తన వద్ద ఉన్నాయన్నారు. 'శుభను వివాహం చేసుకున్నాను. అభ్యంతరం చెప్పకూడదని విజయ్‌ చేసిన ఆదేశాల్ని పాటించానని' నాగరత్న తెలిపారు. ఇప్పుడిలా విడాకులిస్తానంటూ చెబుతున్నారని వాపోయారు.

    English summary
    Shubha Poonja, who has been busy shooting Meenakshi, said, "I am not aware of their divorce and I'm not the reason behind it. Vijay and I have worked together in a few films and our relationship is limited to professional."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X