శుభలేఖ+లు తొలి పాట ఆవిష్కరణ.. ఆకట్టుకొంటున్న పద్మనాభ సాహి!
నిర్మాతలు విద్యాసాగర్, ఆర్ఆర్ జనార్ధన్ నిర్మాణ సారథ్యంలో దర్శకుడు శరత్ నార్వాడే రూపొందిస్తున్న చిత్రం శుభలేఖ+లు. ఈ చిత్రంలో శ్రీనివాస సాయి, ప్రియా వడ్లమాని, దీక్షాశర్మ రైనా హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. కేఎం రాధకృష్ణన్ సంగీతం అందిస్తున్నారు. పెళ్లి కోసం ఆడే అబద్ధాలు ఆడటాన్ని ఈ కాలంలో ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి విషయాలను డిస్కస్ చేస్తూ చాలా ఇన్నొవేటివ్ కథాంశంతో శుభలేఖ+లు చిత్రం రూపొందుతోంది. ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నది.
ఫీల్‌గుడ్ చిత్రంగా రిలీజ్‌కు ముందే ప్రచారం జరుగుతున్న శుభలేఖ+లు చిత్రంలో మొత్తం ఆరుపాటలు ఉన్నాయి. పద్మానాభ పాహి అనే తొలిపాటను శనివారం ఆవిష్కరించారు. క్లాసికల్ టచ్‌తో వెస్ట్రన్ ఫీల్‌తో సాగే ఈ పాట ఆకట్టుకొనేలా ఉంది.

ఇటీవల నిర్మాతలు సి.విద్యాసాగర్, ఆర్. ఆర్. జనార్దన్ మాట్లాడుతూ వంద అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయాలంటారు. కానీ ఈ జనరేషన్ దానికి అసలు అంగీకరించడం లేదు. పెళ్లి అయినా, ఇంకేదైనా సరే నిజం దాయకూడదంటున్నారు. ఫలితం ఎలా ఉన్నా వాళ్లు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు అని వెల్లడించిన సంగతి తెలిసిందే.

అప్పాజీ , డా. ఇర్ఫాన్ , తిరువీర్,సింధు తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ - మాటలు: జనార్దన్ -విస్సు, సంగీతం: కేఎమ్ రాధాకృష్ణన్, కెమెరా: మురళీమోహన్ రెడ్డి, ఎడిటింగ్: మధు, ఆర్ట్: బ‌్రహ్మ కడలి, ప్రొడక్షన్ కంట్రోలర్: కె.సూర్యనారాయణ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శరత్ నర్వాడే.


Click it and Unblock the Notifications











