twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వ్యభిచారం కేసు: శ్వేతా బసుకు కోర్టు క్లీన్ చిట్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఇటీవల వ్యభిచారం చేసిందనే ఆరోపణలతో అరెస్టై కొంత కాలం రెస్క్యూ హోంలో ఉన్న కొత్త బంగారు లోకం' హీరోయిన్ శ్వేతాబసు ప్రసాద్ కు ఊరట లభించింది. తనను అన్యాయంగా అరెస్టు చేసారు. నేను ఎలాంటి తప్పు చేయలేదని శ్వేతా బసు ముందు నుండి వాదిస్తూనే ఉంది. అయితే పోలీసులు మిత్రం ఆమెపై పలు అభియోగాలు నమోదు చేసారు.

    ఎట్టకేలకు ఆమె పోరాటం ఫలించింది. ఈ కేసులో ఆమెకు క్లీన్ చీట్ ఇచ్చింది. ఆమెపై పోలీసులు మోపిన అభియోగాలను కొట్టివేసింది. శ్వేతా బసు ఏ తప్పూ చేయలేదని, పోలీసులే కావాలని ఈ కేసులో ఇరికించారని ఆమె తరపు న్యాయవాది వాదించారు. ఈ వాదనతో కోర్టు ఏకీభవించింది. ఆమెకు క్లీన్‌చిట్‌ ఇస్తూ తీర్పు ఇచ్చింది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై శ్వేతా బసు హర్షం వ్యక్తం చేశారు. తీర్పు వెలువడిన తర్వాత శ్వేతా బసు ప్రసాద్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ రోజు కోసమే చాలా రోజులుగా వేచి చూస్తున్నానని, ఈ తీర్పుతో నా కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారని తెలిపింది.

    Shweta Basu Prasad gets clean chit from Hyderabad Court

    బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు నిర్వహించిన డెకాయ్‌ ఆపరేషన్‌లో శ్వేతా బసు పట్టుబడిన సంగతి తెలిసిందే. ఆమెను ఆరు నెలలపాటు రెస్క్యూ హోంకు తరలించాలని ఎర్రమంజిల్‌ కోర్టు ఆదేశించింది. దీంతో ఆమె తల్లి హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు రెస్క్యూ హోం నుండి ఆమెను నెల క్రితం విడుదల చేసారు.

    కాగా...ఈ కేసులో పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ కేసులో పోలీసులు ఓవర్ యాక్షన్ చేసారని పలువురు సినీ సెలబ్రిటీలు బహిరంగంగానే విమర్శించారు. ఈ కేసులో శ్వేతా బసును అరెస్టు చేసిన పోలీసులు ఆమెతో పాటు ఉన్న వ్యాపారిని కావాలని తప్పించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మహిళా సంఘాలు ఆందోళన చేసాయి కూడా.

    కాగా...ప్రస్తుతం శ్వేతా బసు ప్రసాద్ ఓ ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థలో స్క్రిప్ట్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నారు. ఆమెకు పలు ఆఫర్లు వస్తున్నా వేటిటీ అంగీకరించడం లేదు. ఇక తెలుగు సినిమాల్లో నటించబోనని ఆమె నిర్ణయించుకున్నట్లు సమాచారం.

    English summary
    Shweta Basu Prasad, who was allegedly involved in a prostitution racket got a clean chit from a sessions court in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X