హీరోయిన్ శ్వేతాబసు పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా!
శ్రీకాంత్ అడ్డాల దర్శత్వంలో వచ్చిన కొత్త బంగారు లోకం చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించింది. వరుణ్ తేజ్ ఈ చిత్రంలో హీరోగా నటించాడు. శ్వేతాబసు ఈ చిత్రంతో హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అద్భుతమైన ప్రేమ కథగా వచ్చిన ఈ చిత్రం యువతతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ హృదయాలు కూడా దోచుకుంది. ఈ చిత్రంతో ఒక్కసారిగా శ్వేతాబసు క్రేజ్ పెరిగిపోయింది. శ్వేతా బసుకు ఆ తరువాత మంచి అవకాశాలు వచ్చినా విజయం సాధించకపోవడంతో స్టార్ హీరోయిన్ గా ఎదగలేకపోయింది. తాజాగా శ్వేతా బసు వివాహం గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

కొత్త బంగారు లోకం తరువాత
కొత్త బంగారు లోకం చిత్రం తరువాత శ్వేతాబసు రైడ్, కళావర్ కింగ్ లాంటి చిత్రాల్లో నటించింది. గ్లామర్ పరంగా జాగ్రత్తలు తీసుకోకపోవడంతో శ్వేతాబసు బాగా బరువు పెరిగింది. దీనితో క్రమంగా శ్వేతకు అవకాశాలు తగ్గాయి. తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా పలు చిత్రాల్లో శ్వేతా నటించింది. శ్వేతా కెరీర్ లో చెప్పుకోదగ్గ విజయం అంటే అది కొత్త బంగారు లోకం మాత్రమే.

ఊహించని ఒడిదుడుకులు
సినిమా అవకాశాలు క్రమంగా తగ్గుతున్న సమయంలో శ్వేతాబసు జీవితంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకున్నాయి. శ్వేతాబసు ప్రసాద్ ఊహించని విధంగా ఓ సారి వ్యభిచార ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ అయింది. దీనితో ఈ హీరోయిన్ కెరీర్ పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ఈ ఇబ్బందులని ఎదుర్కొని ఇప్పుడు మళ్ళీ నటనపై దృష్టి పెట్టింది.

పెళ్లి కబురు
ఇక నటించింది చాలు అని భావించిందో ఏమో కానీ అతి త్వరలో శ్వేతాబసు వివాహానికి సిద్ధం అవుతోంది. గత కొంత కాలంగా ఓ దర్శకుడితో శ్వేతబసు ప్రేమలో ఉంటోంది. ఇరు కుటంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో డిసెంబర్ 13 న శ్వేతా వివాహానికి సిద్ధం అవుతోంది. ఇంతకీ శ్వేతా బసుకు కాబోయే వరుడు ఎవరంటే.. దర్శకుడిగా రాణిస్తున్న రోహిత్ మిట్టల్.

ప్రేమలో విహరిస్తూ
కొంత కాలంగా ఈ జంట చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికారికంగా ఒక్కటి కాబోతుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. కుటుంబ సభ్యుల మధ్య పుణేలో శ్వేతా వివాహం జరుగుతుంది. ఆ తరువాత ముంబైలో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు. బెంగాలీ, మార్వాడి సంప్రదాయంలో తమ వివాహం జరగబోతున్నట్లు శ్వేతా ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించింది.


Click it and Unblock the Notifications











