శ్వేతా బసుకు ఆయన నుండి కాల్ వచ్చింది
హైదరాబాద్: తెలుగు హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ గత కొన్ని రోజుల క్రితం సెక్స్ రాకెట్లో అరెస్టయి కొంత కాలం పాటు రెస్క్యూ హోంలో గడిపిన సంగతి తెలిసిందే. ఆమె పరిస్థితి చూసి పలువురు సినీ ప్రముఖులు ఆఫర్లు ఇవ్వడానికి తాము సిద్ధమే అని ఆ మధ్య ప్రకటించారు. అలాంటి వారిలో ఒకరు ప్రముఖ జాతీయ అవార్డు గ్రహిత, దర్శకుడు హన్సల్ మెహతా.

తాను ఇచ్చిన మాట ప్రకారం ఆయన శ్వేతా బసుకు అవకాశం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. తాను తెరకెక్కించబోయే డాక్యుమెంటరీలో శ్వేతా బసును తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ విషయాన్ని అతను శ్వేతా బసుకు వెల్లడించడం, ఆమె అంగీకరించడం కూడా జరిగిపోయింది.
హిందూస్థానీ క్లాసికల్ మ్యూజిక్ పై ఆయన తీస్తున్న డాక్యుమెంటరీలో శ్వేతా బసు నటించబోతోంది. ఈ విషయం గరించి శ్వేతా బసు మాట్లాడుతూ...ఈ డాక్యుమెంటరీలో నటించడం చాలా సంతోషంగా ఉందని, ఎంతో ఎగ్జైటెడ్‌గా ఉందని చెప్పుకొచ్చారు. ఈ డాక్యుమెంటరీ తర్వాత శ్వేతా బసుకు మరిన్ని సినీ అవకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. తెలుగు హీరో విష్ణు కూడా ఆమెకు అవకాశాలు ఇస్తానంటూ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. రెస్య్కూ హోం నుండి విడుదలైన తర్వాత శ్వేతా బసు ముంబై వెళ్లి పోయిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











