సుశాంత్ ‘అడ్డా’లో బ్యాడ్ గర్ల్ (హాట్ ఫోటోలు)
హైదరాబాద్ : మహేష్ బాబు 'బిజినెస్ మేన్' చిత్రంలో విలైక్ బ్యాడ్ బాయ్స్ అంటూ...బ్యాడ్ గర్ల్ చేష్టలతో హాట్ అండ్ సెక్సీగా అందాలు ఆరబోస్తూ ఐటం సాంగులో దుమ్ము రేపిన బాలీవుడ్ గర్ల్ శ్వేతా భరద్వాజ్ తాజాగా సుశాంత్ హీరోగా రూపొందుతున్న 'అడ్డా' చిత్రంలో మరోసారి తన అందాల విందు చేయబోతోంది.
ఈ మేరకు అన్నపూర్ణ స్టూడియోలో ఐటం సాంగు చిత్రీకరణ కోసం స్పెషల్ సెట్ వేసారు. ఈ పాటలో శ్వేతా భరద్వాజ్ ఇండో-వెస్టర్న్ వేషధారణతో చాలా సెక్సీగా కనపడబోతోందని, డిజైనర్ కుర్తా, బ్లూ జీన్స్ లో సుశాంత్ ఆమెతో కలిసి స్టెప్పులేయబోతున్నాడని యూనిట్ వర్గాలు చెబుతున్నారు.
అడ్డా సినిమా వివరాల్లోకి వెళితే...
సుశాంత్, శాన్వి జంటగా శ్రీ నాగ్ కార్పొరేషన్ పతాకంపై జి.ఎస్.కార్తీక్ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'అడ్డా'. చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు గా చివరి దశకు చేరుకుంది. మిగతా వివరాలు స్లైడ్ షోలో....

''ప్రేమ భావనపై ముసురుకున్న అపోహల్ని తొలగించే చిత్రమిది. నిజమైన ప్రేమకు అర్థాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నామని దర్శకుడు తెలిపారు.

ప్రతి సన్నివేశం వినోదాత్మకంగా సాగుతుంది. భావోద్వేగాలకు ప్రాధాన్యముంది. సుశాంత్ నటన కొత్త పంథాలో సాగుతుంది''అన్నారు.

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన శ్వేత ‘మిషన్ ఇస్తాంబుల్' చిత్రం ద్వారా బాలీవుడ్ తెరంగ్రేటం చేసింది.

తెలుగులో ఆమె చేసిన బిజినెస్ మేన్ చిత్రంలోని ఐటం సాంగుకు మంచి స్పందన వచ్చింది.

అడ్డా చిత్రంలో ఇంకా రఘుబాబు, కోట శ్రీనివాసరావు, తాగుబోతు రమేష్, తనికెళ్ల భరణి, వేణు మాధవ్ తదితరులు నటిస్తున్నారు.

ఈచిత్రానికి కెమెరా: అరుణ్ కుమార్, సంగీతం: అనూప్ రూబెన్స్, నిర్మాతలు: చింతలపూడి ఎనివాసరావు, నాగ సుశీల, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: జి. సాయి కార్తీక్.

శ్వేతా భరద్వాజ్ హాట్ లుక్

శ్వేతా భరద్వాజ్ హాట్ లుక్ ఫొటో

శ్వేతా భరద్వాజ్ హాట్ లుక్ ఫొటో

శ్వేతా భరద్వాజ్ హాట్ లుక్ ఫొటో

అడ్డా సినిమాలో సుశాంత్, శ్వేతా ఐటం సాంగ్


Click it and Unblock the Notifications











