తల్లయిన శృంగార తార
ముంబై: మళయాళ హాట్ ఆంటీ శ్వేతా మీనన్ తల్లయిది. శుక్రవారం(సెప్టెంబర్ 28) సాయంత్రం 5.27 గంటలకు ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ముంబైలోని నానా వతి నర్సింగ్ హోంలో శ్వేతామీనన్ కు ప్రసవం అయింది. ప్రసవం సమయంలో శ్వేతా మీనన్ భర్త శ్రీవాస్తవన్ మీనన్ ఆమె పక్కనే ఉన్నారు. శ్వేతా మీనన్ లాస్ట్ 4 నెలల ప్రెగ్నెన్సీ, డెలివరీ కెమెరాలో చిత్రీకరించారు. బ్లోస్సీ దర్శకత్వంలో రూపొందుతున్న మలయాళం మూవీ 'కాలిమన్ను' చిత్రం కోసం ఈ సీన్లను వాడనున్నారు.
శ్వేతా మీనన్ తెలుగులో 'రాజన్న' చిత్రంలో దొరసాని పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఆమె నటించిన 'రతి నిర్వేదం' చిత్రం కూడా ఆ మధ్య తెలుగులో విడుదలైన హాట్ టాపిక్ గా మారింది. వయసు పైబడిన మహిళ, తనకంటే చిన్న వాడైన కుర్రాడి మధ్య ప్రేమ కాని ప్రేమ, బంధం కానీ 'సం'బంధం, ఉరకలెత్తే యవ్వన కోరికలు... తదితర అంశాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందించారు.
శ్వేతా మీనన్ గతంలో హీరోయిన్‌గా నటించింది. తర్వాత లావెక్కి షకీలా తయారవ్వడంతో అందరూ శృంగార పరమైన పాత్రలు మాత్రమే ఇవ్వడం మొదలు పెట్టారు. రాజన్న,రతి నిర్వేదం,ఏక వీర చిత్రాలతో తెలుగు వారికి దగ్గరైన శ్వేత మీనన్ తనపై పడిన శృంగార తార ముద్రను తొలిగించుకోవటానికి ఆ మధ్య బరువు తగ్గించుకోవాలనే నిర్ణయానికి వచ్చింది కానీ అమలులో పెట్టలేక పోయింది.


Click it and Unblock the Notifications












