twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'తంత్ర'

    By Staff
    |

    Shweta Menon
    'మంత్ర' అయిపోయింది. ఇప్పుడు 'తంత్ర' వస్తోంది. అయితే ఇది స్ట్రయిట్ ఫిలిం కాదు. మళయాళ డబ్బింగ్ వ్యవహారం. ఉత్తరాది అందాల తార శ్వేతా మీనన్‌ హీరోయిన్ గా మలయాళంలో ఘన విజయం సాధించిన 'తంత్ర' చిత్రం ఇప్పుడు అదే పేరుతో తెలుగులో రానున్నది. ఇదివరలో 'తిరుపతి' చిత్రాన్ని అందించిన నిర్మాత నాగరాజు ఈ సినిమాను అందిస్తున్నారు.

    ఈ సంగతిని ఆయన తెలియజేస్తూ "హారర్‌, సస్పెన్స్‌ ప్రధానంగా ఈ సినిమా రూపొందింది. శ్వేతా మీనన్‌ అందచందాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. కథ ప్రకారం ఒక క్షుద్ర ఉపాసకుని వద్ద తాంత్రిక విద్యలు నేర్చుకున్న శ్వేతను హీరో అరవిందన్‌ ఎలా ఎదుర్కొన్నాడనే అంశాన్ని దర్శకుడు కె.జె. ఘోష్‌ ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందించారని చెప్తున్నారు.

    అలాగే అడుగడుగునా సస్పెన్స్‌తో, అందర్నీ ఆకట్టుకునే భయానక భీభత్స దృశ్యాలతో నిండిన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకముంది. ఈ నెల చివరి వారంలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని చెప్పారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X