కొత్త బంగారం బ్యూటీ మళ్లీ వచ్చేస్తోంది... నవ్వించడమే ధ్యేయం అంటోన్న శ్వేతా బసు
కొత్తబంగారు లోకం మూవీతో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన శ్వేతా బసు, ఆ తరువాత రెండు మూడు సినిమాలకే డీలాపడిపోయింది. ఇక అనంతరం చోటుచేసుకున్న దురదృష్టకర పరిణామాలు అందరికీ తెలిసనవే. అయితే, అన్నింటినీ తట్టుకుని తిరిగి సినీ కెరీర్ ప్రారంభించిన శ్వేతా, ఇప్పుడు మళ్లీ నటనపై దృష్టిసారించింది.
ఆ మధ్య బాలీవుడ్ లో డైరెక్టర్ అనురాగ్ బసు క్యాంప్ లో రైటర్ గా కెరీర్ మొదలుపెట్టిన శ్వేతా, అక్కడే ఒకబ్బాయిని ప్రేమించి పెళ్లాడింది. కానీ, కొద్ది రోజులకే వారిద్దరూ విడిపోయారు. ఓ వైపు సీరియల్స్ లోనూ, మరోవైపు షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ అంటూ కాలం వెళ్లదీసిన శ్వేతా, ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ జీ5 నిర్మిస్తున్న చిత్రంలో నటించేందుకు అంగీకరించింది.

"కామెడీ కపుల్" టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్వేతా మెయిన్ లీడ్ గా కనిపించబోతోంది. ఇక అమ్మడికి జోడీగా సాకిబ్ సలీమ్ నటించనున్నాడు. స్టాండప్ కామెడీ కళ ఊపందుకుంటోన్న నేపథ్యంలో గుర్గావ్ కు చెందిన కామెడీ జంట ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంది అన్నదే సినిమా ఇతివృత్తమని తెలుస్తోంది. ఇక శ్వేత కూడా సినిమాలో గట్టిగానే నవ్వించబోతోందని అర్ధమవుతోంది.
నిచికేత్ సమంత్ దర్శకత్వంలో కొద్ది రోజల క్రితమే షూటింగ్ ప్రారంభమవ్వగా, కరోనా నేపథ్యంలో అన్నీ జాగ్రత్తలూ తీసుకుంటున్నట్లు చిత్ర బృందం తెలిపింది. మరి సక్సెస్ ఫుల్ గా సినీ కెరీర్ మొదలుపెట్టి శ్వేతా, ఇదే కాన్ఫీడెన్స్ తో ముందుకు సాగాలని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











