పెళ్లి పేరుతో మోసం.. పోలీసుల అదుపులో సినిమాటోగ్రాఫర్ శ్యాం కే నాయుడు

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యాం కే నాయుడు ఇబ్బందుల్లో పడ్డారు. తనను పెళ్లి చేసుకొంటానని చెప్పి మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదుతో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. శ్యాం కే నాయుడు వ్యవహారం ఇప్పుడు సినీ వర్గాల్లో సంచలనం రేపింది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

Recommended Video

Chota.K.Naidu Brother Taken Into Custody By S.R.Nagar Police
కొద్దికాలంగా ఇద్దరు సన్నిహితంగా

కొద్దికాలంగా ఇద్దరు సన్నిహితంగా


శ్యాం కే నాయుడుతో కొంత కాలంగా సన్నిహితంగా ఉంటున్నాను. తాము కొన్నేళ్లుగా అఫైర్‌లో ఉన్నాం. ప్రస్తుతం తనను దూరంగా పెట్టి పట్టించుకోవడంలేదు. తనను పెళ్లి చేసుకొంటానని చెప్పి మోసగించారు అని సాయిసుధ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో శ్యాం కే నాయుడుని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

పెళ్లి మాట ఎత్తగానే దూరంగా

పెళ్లి మాట ఎత్తగానే దూరంగా

హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు స్వయంగా వచ్చి ఫిర్యాదు చేశారు. తనను పెళ్లి చేసుకొంటానని మాటిచ్చాడు. గత కొద్దికాలంగా మా మధ్య పెళ్లి విషయం చర్చకు రావడంతో ఆయన నాకు దూరంగా ఉంటున్నారు. తనను కలిసేందుకు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి అని వర్ధమాన నటి సాయిసుధ పోలీసులకు తెలిపినట్టు సమాచారం.

శ్యాం కే నాయుడిపై ఫిర్యాదు నిజమే

శ్యాం కే నాయుడిపై ఫిర్యాదు నిజమే


వర్ధమాన నటి సాయి సుధ ఫిర్యాదు చేసింది నిజమే. ఆమె ఫిర్యాదు ఆధారంగా శ్యాం కే నాయుడిని అదుపులోకి తీసుకొన్నాం. అయితే శ్యాంపై సాయి సుధ చేసిన ఆరోపణల్లో ఎంత నిజముందనే కోణంలో కేసును విచారిస్తున్నాం. శ్యాం కే నాయుడు స్టేట్ మెంట్‌ను కూడా తీసుకొన్నాం అని ఎస్ఆర్ నగర్ పోలీసులు తెలిపారు.

కేసును దర్యాప్తు చేస్తున్నాం..

కేసును దర్యాప్తు చేస్తున్నాం..

శ్యాం కే నాయుడు, సుధా మధ్య ఎన్ని రోజులుగా అఫైర్ కొనసాగుతున్నది. వారి మధ్య ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయనే విషయాలపై సమాచారం సేకరిస్తున్నాం అని పోలీసులు తెలిపారు. అయితే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడటానికి సాయిసుధ నిరాకరించారు. ఒకవేళ శ్యాం కే నాయుడిపై చర్యలు తీసుకోకపోతే తాను మీడియా ముందుకు వస్తాను అని సాయిసుధ చెప్పారు.

చోటా కే నాయుడు సోదరుడిగా

చోటా కే నాయుడు సోదరుడిగా

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడుకి శ్యాం కే నాయుడు సోదరుడు. గతంలో డ్రగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్నారు. తాజాగా యువతిని మోసగించిన వ్యవహారంలో ఆయనపై కేసు నమోదు చేయడం సినీ వర్గాల్లో సంచలనం రేపింది. అయితే సాయి సుధ చేసిన ఆరోపణల్లో ఎంత వాస్తవముందనేది త్వరలోనే పోలీసుల విచారణలో వెల్లడి అవుతుందనేది సినీ వర్గాల వాదన.

అర్జున్ రెడ్డి చిత్రం ద్వారా

అర్జున్ రెడ్డి చిత్రం ద్వారా

సాయి సుధ విషయానికి వస్తే.. అర్జున్ రెడ్డి చిత్రంలో నటించడం ద్వారా గుర్తింపు పొందారు. అలాగే పలు తెలుగు సినిమాల్లో నటించారు. ఇప్పుడిప్పుడే వర్థమాన తారగా ఎదుగుతున్న సాయిసుధ ఇలా వివాదంలో ఇరుక్కోవడం చర్చనీయాంశమైంది. తనకు న్యాయం జరిగే వరకు ఈ వ్యవహారంలో పోరాడుతాననే ధీమాను ఆమె వ్యక్తం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X