ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ చివరి వీడియో వైరల్‌.. సూసైడ్ నోట్‌లో ఏం చెప్పారంటే?

జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ అనుమానస్పద మృతిపై తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. అయితే శ్యామ్ మృతిపై ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇందులో శ్యామ్ మృతి వెనుక పార్టీ హస్తం ఉందనే ప్రచారం జరుగుతుండగా... మరోవైపు ఇతర హీరోల అభిమానుల హస్తం కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా శ్యామ్ చనిపోయే ముందు తీసుకున్న చివరి సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే....

ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్ : ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్యామ్ హోటల్ మేనేజ్ మెంట్ పూర్తి చేసి జాబ్ సెర్చింగ్ లో ఉన్నాడు. అయితే ఈ మధ్య విశ్వక్ సేన్ నటించిన ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరవ్వగా... ఆ వేదిక పైకి వెళుతుండగా ఎన్టీఆర్ ను మెరుపు వేగంతో వచ్చి పట్టుకున్నాడు. ఆ సమయంలో సెక్యూరిటీ అతని లాగేద్దాం అని ప్రయత్నించగా ఎన్టీఆర్ వారిని ఆపి ఫోటో కూడా దిగాడు. ఈ వీడియో అప్పట్లో వైరల్ గా మారింది.

 ntr

హ్యాష్ ట్యాగ్ వైరల్ : అయితే శ్యామ్ అనుమానాస్పద మృతి చెందడం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతుంది. బ్లేడుతో కోసుకొని ఆ తర్వాత ఉరివేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. శ్యామ్ మృతిపై ఏపీ పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అటు సోషల్ మీడియాలో #WeWantJusticeForShyamNTR అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అయితుంది. ఏపీ పోలీసులు వెంటనే స్పందించి దర్యాప్తు చేయాలని కోరుతున్నారు.

jrntrfanshyamdeathmystery1

సెల్ఫీ వీడియో వైరల్ : శ్యాం మృతిపై ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు, జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. శాంతి తమను కలిసివేసిందంటూ నోట్ విడుదల చేశారు. ఇదిలా ఉంటే శ్యామ్ కి సంబంధించిన ఓ సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది. అది శ్యామ్ చనిపోయే ముందు చివరిసారిగా తీసుకున్న సెల్ఫీ వీడియో గా తెలుస్తుంది. అయితే శ్యామ్ మాట్లాడిన మాటలు వింటుంటే తాను ఆత్మహత్య చేసుకున్నట్లు అర్థమవుతుంది.

jrntrfanshyamdeathmystery2

ఏం చెప్పాడంటే : అందులో ఐ యామ్ సారీ డాడీ, ఐ యాం సారీ, నేను ఉన్నా... లేకపోయినా.. హ్యాపీగా ఉండండి. నన్ను ఇన్ని రోజులు పెంచినందుకు థాంక్స్ మమ్మీ డాడీ. నేను అందరి దృష్టిలో వేస్ట్. నేను ఉన్నా కానీ లాభం లేదు. సరైనా మమ్మీ.. డాడీ.. లవ్ యు ఫర్ ఎవర్. మళ్ళీ జన్మంటూ ఉంటే మీకే పుట్టాలి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు. జాబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ అస్సలు లేదు. నావల్ల కాదు జాబ్ చేయడం కూడా అందుకే నేను డిసైడ్ చేసుకున్నా... మిస్ యు మమ్మీ, మిస్ యు డాడీ... అన్న శ్రీను అన్న.. మిస్ యు అన్న.. ఐ లవ్ యు అన్న... బిగ్గెస్ట్ బ్రదర్ నువ్వే అన్న మళ్లీ నాకు జన్మంటూ ఉంటే నీ శిష్యుడుగానే పుట్టాలన్న అంటూ వీడియోలో చెప్పకు వచ్చాడు శ్యామ్. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X