'అరుంధతి' అప్ లోడ్...

మల్లెమాల ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై తాను నిర్మించిన 'అరుంధతి' చిత్రం ఆంధ్రప్రదేశ్ అంతటా విజయఢంకా మోగిస్తున్న తరుణంలో కొన్ని వెబ్ సైట్లు తమ అనుమతి కానీ, సంస్థ అనుమతి గానీ లేకుండా అక్రమంగా సినిమాను అప్ లోడ్ చేస్తున్న వైనం తమ దృష్టికి వచ్చిందని, ఈ చర్యలను తాము తీవ్రంగా పరిగణిస్తామని చిత్ర నిర్మాత ఎం.శ్యాంప్రసాద్ రెడ్డి ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. చట్టపరమైన అన్ని చర్యలకు తాము వెనుకాడేది లేదని ఆయన హెచ్చరించారు.
ఒకవేళ ఇండియాలోని సైబర్ చట్టాలు పరిధిలోకి రాని బయట వెబ్ సైట్లు ఇలాంటి చర్యలకు పాల్పడితే ఇండియన్ కాన్సలేట్ సాయంతో తమ లాయర్లు అలాంటి వెబ్ సైట్ల యాజమాన్యాలను సమర్ధవంతగా ఎదుర్కొంటామని చెప్పారు. 'అరుంధతి' చిత్రం తమ సొంత ఆస్తి అయినందున, దానిపై ఉన్న హక్కులను కాపాడుకునేందుకు తాము జరిపే న్యాయపోరాటానికి అంతా సహకరించాల్సిందిగా ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు.
పైరసీదారుల చర్యలు ఒక నిర్మాతగా, సినిమా మాధ్యమాన్ని ఎంతగానో ప్రేమించే వ్యక్తిగా తనకు తీవ్ర వేదన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలోని సైబర్ చట్టాలను సమర్ధవంతంగా వినియోగించుకుని పైరసై రక్కసిని తుదముట్టించేందుకు తాను, తన సంస్థ శక్తివంచన లేకుండా పోరాటతామని చెప్పారు.


Click it and Unblock the Notifications











