ఆ సినిమా రిలీజ్ కోసం వెయిటింగ్..శ్యామ్ ప్రసాద్ రెడ్డి
"నేను ఎప్పుడూ ఓ చిత్రం రిలీజ్ కోసం ఇంతలా ఎదులు చూడలేదు..నాకు ఆ చిత్రం మీద హై ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి" అంటున్నారు 'అరుంధతి' నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి. ఆయన ఎదురు చూస్తున్న చిత్రం 'అవతార్'. ఈ చిత్రం పై ఎందుకు అంత ఆసక్తో ఆయన చెపుతూ..ఏలియన్స్, ట్రూ లైస్, అబీస్, టైటానిక్ వంటి చిత్రాల డైరక్టర్ జేమ్స్ కెమెరాన్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కావటమే నా ఇంట్రస్టుకు కారణం అంటున్నారు. ఈ 161 నిముషాల చిత్రం ప్రపంచ సినీ చరిత్రంలో అత్యంత ఖరీదైన బడ్జెట్టుతో తయారైంది. దాదాపు 2,400 కోట్లు ఈ చిత్రం కోసం గుమ్మరించారు. ఇక శ్యామ్ ప్రసాద్ నిర్మించిన అరుంధతి ఈ సంవత్సరం జెన్యూన్ గా సూపర్ హిట్ అయిన వాటిలో ఒకటి అన్నదనే సంగతి తెలిసిందే. అరుంధతి చిత్రంలోనూ గ్రాఫిక్స్ కే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే మరింత గ్రాపిక్స్ తో వస్తున్న అవతార్ పై ఆయనకు ఆసక్తి ఉండటం సహజమే.
More from Filmibeat
శ్యామ్ ప్రసాద్ రెడ్డి అరుంధతి అనూష్క అవతార్ టైటానిక్ ఏలియన్స్ జేమ్స్ కెమెరాన్ shyam prasad reddy arundhati anushka avathar titanic james cameran


Click it and Unblock the Notifications











