నందుల గొడవ: నిర్మాత మండలి అధ్యక్షుడిగా శ్యాంప్రసాద్ రాజీనామా
హైదరాబాద్: నిర్మాత మండలిలో అధ్యక్షుడు శ్యాంప్రసాద్ రెడ్డి నిర్మాతల మండలి అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. నిర్మాతల మండలిలో నెలకొన్ని విబేదాలే ఇందుకు కారణం అని చిత్ర ప్రముఖులు పేర్కొంటున్నారు. నిర్మాతన మధ్య ఎప్పటినుండో ఉన్న విభేదాలు ఇటీవల ప్రకటించిన నంది అవార్డుల కారణంగా తారాస్థాయికి చేరుకున్నాయి.
దాసరి నారాయణరావుకు ఉత్తమ నటుడు నంది అవార్డు ఇవ్వడాన్ని ప్రజారాజ్యం పార్టీ ప్రశ్నించింది. మగధీరలో నటనకు గాను రామ్ చరణ్ తేజకు కాకుండా దాసరిని ఈ అవార్డు ఇవ్వడాన్ని వారు మీడియా ముందు ప్రశ్నించారు. ఇందులో రాజకీయం ఉందని వ్యాఖ్యానించారు. అందుకు ప్రతిస్పందనగా నట్టికుమార్ అనే నిర్మాత మూడేళ్ల క్రితం చిరంజీవి పద్మభూషణ్ ఇవ్వడం వెనుక రాజకీయం ఉందని కుండబద్దలు కొట్టారు. దాసరి నంది అవార్డు, చిరంజీవి పద్మభూషణ్ ముదిరి పాకాన పడింది. ఇప్పటికే వర్గాలుగా ఉన్న నిర్మాతల మండలిలో విభేదాలు తారాస్థాయికి చేరటంతో అవి శ్యాంప్రసాద్ రెడ్డిని తాకాయి. దీంతో ఆయన మనస్థాపం చెంది రాజీనామా చేశారు.


Click it and Unblock the Notifications











