శ్యామ్ సింగరాయ్ కోసం మొదటిసారి ఆ పని చేస్తున్న నాని.. ఎలాగైనా సక్సెస్ అవ్వాలని..

టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసినా కూడా ఆ సినిమా సక్సెస్ అయ్యే విధంగా ప్రమోషన్స్ కూడా చేస్తాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక సినిమా సెట్స్ పైకి వచ్చింది అంటే చాలు అది పూర్తయ్యే వరకు కూడా నాని చాలా బాధ్యతగా ఉంటాడు. ప్రతి విషయంలోనూ అందరితో కలిసి చర్చలు జరుపుతూ ఉంటాడు. సినిమా ఫైనల్ అవుట్ పుట్ అద్భుతంగా ఉండాలి అని అందరితో కలిసి పనిచేస్తాడు. అవసరమైతే సెట్స్ లో ఉన్నప్పుడు ఒక సహాయక దర్శకుడిగా కూడా వర్క్ చేస్తూ ఉంటాడు అని ఆయనతో పనిచేసిన దర్శకులు కూడా చెబుతుంటారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో మీడియం హీరో రేంజ్ నుంచి స్టార్ హీరో రేంజ్ వరకు క్రేజ్ అందుకుంటున్న అతికొద్దిమంది వారిలో నాని టాప్ లో ఉన్నాడు అని చెప్పవచ్చు.

ఎలాంటి సపోర్ట్ లేకుండా సోలో గా అడుగుపెట్టిన నాని ప్రస్తుతం తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇక తన స్థాయిని సౌత్ ఇండస్ట్రీలో కూడా మరింత పెంచుకోవాలని నాని ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోలందరూ కూడా పాన్ ఇండియా సినిమాలు అంటూ భారీ స్థాయిలో ఆలోచిస్తున్నారు. కాని నాని మాత్రం ముందుగా సౌత్ ఇండస్ట్రీలో అన్ని భాషల్లోనూ పట్టు సాధించాలని ఆలోచిస్తున్నాడు. రాబోయే శ్యామ్ సింగారయ్ సినిమా తెలుగుతో పాటు కన్నడ మలయాళం తమిళంలో కూడా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. రాహుల్ సాకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకులు అయితే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అవుతున్నాయి.

 Shyam Singha Roy movie nani first time dubbing in tamil language

ఏక్ వీలైనంత వరకు అన్ని భాషల్లో కూడా డబ్బింగ్ చెప్పాలని నాని ప్రయత్నం చేస్తున్నాడు. ముందుగా నాని తమిళ వెర్షన్ కి డబ్బింగ్ చెప్పాలని అనుకుంటున్నాడట. ఆ తరువాత మిగతా భాషల్లో కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ సెట్ అవ్వకపోతే ఆ భాషకు తగ్గట్టు వేరే వారితో చెప్పించడానికి ప్రయత్నం చేస్తారట. ఏదేమైనా కూడా నాని మాత్రం తన సినిమా విషయంలో చా బాధ్యతగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఈ సినిమా భారీ బడ్జెట్ తో కూడుకున్నది. నాని మార్కెట్ ను మించి నిర్మాతలు భారీ స్థాయిలో ఖర్చు పెట్టారు. ఈ సినిమాతో ఎలాగైనా తన మార్కెట్ ను అంతకుమించి పెంచుకోవాలి అని కూడా నాని చాలా తాపత్రయపడుతున్నాడు. ఇమా టాక్సీ వాలా సినిమా అనంతరం యువ దర్శకుడు రాహుల్ సకృత్యాన్ కూడా సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో నాని రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. పూర్వజన్మల నేపద్యంలో నాని డిఫరెంట్ రోల్స్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి తో పాటు ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కూడా ప్రత్యేకమైన పాత్రలో కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక డిసెంబర్ 24న విడుదల కాబోయే శ్యామ్ సింగరాయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X