For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సురేంద్రరెడ్డి నెక్ట్స్ హీరో

    By Staff
    |
    Shyam
    కిక్ సినిమాతో పరిచయమైన తమిళ నటుడు శ్యామ్ ని హీరోగా తెలుగు తెరకు పరిచయం చేయటానికి సురేంద్రరెడ్డి ప్రయత్నిస్తున్నాడని సమాచారం. ఈ వార్త తమిళ పిల్మ్ సర్కిల్స్ లో బాగా ప్రచారంలో ఉంది. కిక్ కి తొంభై అయిదు శాతం ఓపినింగ్స్ వచ్చాయని, అందులో శ్యామ్ కీ భాగం ఉందని వారు చెప్తున్నారు. అలాగే షూటింగ్ సమయంలో శ్యామ్ బాగా గాయపడ్డప్పుడు యూనిట్ సభ్యులంతా రెస్ట్ తీసుకోమని చెప్పారని, అయితే శ్యామ్ పట్టు వదలక గ్యాప్ రానీయకుండా సినిమా పూర్తి చేసాడని అక్కడ పత్రికలు రాస్తున్నాయి.

    దానికి ముచ్చటపడిన సురేంద్ర అతనికి తన నెక్ట్స్ సినిమాలో హీరోగా అవకాశం ఇస్తానని ప్రామిస్ చేసాడని, త్వరలోనే ఆ ప్రామిస్ నెరవేర్చుకుంటాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇంతకు ముందు తమిళ్ లో శ్యామ్ 12 బి అనే చిత్రంలో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత కొన్ని ప్రేమ కథల్లో చేసాడు కానీ పెద్ద గా పేరు రాలేదు. ఇక ఈ చిత్రంలో అతని ఫెరఫార్మెన్స్ కొందరు తెలుగు నిర్మాతలుకు కూడా నచ్చిందని వారు కూడా అతన్ని సంప్రదిస్తున్నారని వినికిడి. ప్రసుత్తం శ్యామ్ తమిళంలో Antony Yaar, Sariya Thavara, Agam puram చిత్రాలు చేస్తున్నాడు. హిందీలో కూడా అతనికి అవకాశాలు వస్తున్నాయి. ఇక ఇంతకీ సురేంద్రరెడ్డి నెక్ట్స్ సినిమాగా ఓ ప్రేమకథను తెరకెక్కిస్తానంటున్నాడు. మరి ఈ ప్రామిస్ నిలబెట్టుకుంటాడో లేడో చూడాలి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X