ప్రభాస్ మ్యారేజ్‌కు పెళ్లికి చీరెలు అక్కడే కొంటాం.. కృష్ణంరాజు కొనిచ్చిన చీరె అదే.. శ్యామలదేవీ

పబ్లిక్ లైఫ్‌కు దూరంగా ఉండే స్వర్గీయ కృష్ణంరాజు సతీమణి శ్యామలదేవి ఇటీవల పలు ప్రైవేట్ ఈవెంట్స్‌లో కనిపించడం ద్వారా ప్రభాస్ అభిమానులకు మరింత చేరువ అవుతున్నారు. కల్కి సినిమా రిలీజ్ రోజున ఆమె మీడియాతో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

తాజాగా ఆమె హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 32 లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ చేతుల మీదుగా జరిగిన జరివరం శారీస్ స్టోర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ వేడుకలో హీరో రక్షిత్ అట్లూరి, నటుడు కృష్ణుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్యామలదేవీ తదితరలు మాట్లాడుతూ..

Shyamala Devi attended Jarivaram Stores

జరివరం స్టోర్‌కు నన్ను అతిథిగా ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. ఈ స్టోర్‌లో కలెక్షన్స్ బాగున్నాయి. కంచిపట్టు చీరెలు చాలా వెరైటీలు పెట్టారు. నాకు వ్యక్తిగతం కంచి పట్టు చీరలంటే ఇష్టం. ఈ వేడుకకు వస్తూ ధరించిన చీర కూడా కంచి పట్టు చీరనే.. నా కోసం కృష్ణంరాజు కొన్న చీర కూడా కంచిపట్టు చీరనే అని ఆమె తన అనుభవాలను శ్యామల దేవీ గుర్తు చేసుకొన్నారు.

Shyamala Devi attended Jarivaram Stores

ప్రభాస్ మ్యారేజ్‌కు పెళ్లి బట్టలు కూడా జరివరం నుంచే కొంటాము. అలాగే ఎక్కడెక్కడో నుంచి తెప్పించిన అత్యంత ఫ్యాషన్ కలెక్షన్లు అందంగా ఉన్నాయి. జరివరం స్టోర్‌ను ప్రారంభించిన అభిలాష రెడ్డి, గాయత్రి గారికి నా అభినందనలు. సదుద్దేశంతో ఈ స్టోర్‌ను ప్రారంభించిన వారికి మంచి సక్సెస్ లభించాలని కోరుకొంటున్నాను అని శ్యామలదేవీ అన్నారు.

అనంతరం మేయర్ విజయలక్ష్మీ మాట్లాడుతూ.. జరివరం స్టోర్‌లో చూస్తే కలెక్షన్లు బాగున్నాయి. పట్టు చీరలపై మక్కువ ఉండే మహిళలు ఈ స్టోర్‌కు రావాలని కోరుకొంటున్నాను. తృతీయ జ్యూయెల్లరీ స్టాల్‌కు లోపల పెట్టడం జరిగింది. ఈ పట్టు చీరల కలెక్షన్స్ చూస్తే కళ్లు తిప్పుకోలేనంతగా ఉన్నాయి. కస్టమర్ల అభిరుచి మేరకు పట్టు చీరలను డిజైన్ చేసి ఇస్తున్నారు. అభిలాష రెడ్డి, గాయత్రి గారు అభిరుచికి తగినట్టు కలెక్షన్లు ఉన్నాయి అని అన్నారు.

Shyamala Devi attended Jarivaram Stores

జరివరం స్టోర్ నిర్వాహకులు అభిలాష రెడ్డి, గాయత్రి మాట్లాడుతూ.. కస్టమర్లకు మంచి అనుభూతిని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ స్టోర్‌ను ప్రారంభించాం. మా వద్ద అని రకాల చీరెలతోపాటు కంచిపట్టు చీరెలు కూడా లభిస్తాయి. మహిళలకు వన్ స్టాప్ స్టోర్‌లో జరివరం షాప్ ఉండాలనే ఉద్దేశంతో ప్రారంభించాం. మా సేకరించిన కలెక్షన్స్, చేయించిన డిజైన్స్ అందర్నీ ఆకట్టుకొంటాయి అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X