»   » సొంత కొడుకే.... ‘కట్టప్ప కనిపించడం లేదు’ అంటూ!

సొంత కొడుకే.... ‘కట్టప్ప కనిపించడం లేదు’ అంటూ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'కట్టప్ప'... ఇపుడు ఈ పేరు గురించి తెలియనివారు ఇండియాలో ఎవరూ ఉండరేమో! బాహుబలి సినిమాలో బాగా పాపులర్ అయిన క్యారెక్టర్ ఇది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. దీనిపై సోషల్ మీడియాలో కొంతకాలం పాటు పెద్ద చర్చే జరిగింది.

'బాహుబలి-2' సినిమా వస్తే తప్ప ఈ ప్రశ్నకు సమాధానం దొరికే పరిస్థితి కనిపించడం లేదు. అయితే అంతలోనే 'కట్టప్ప కనిపించడం లేదు' అనేది హాట్ టాపిక్ అయింది. ఇదంతా కట్టప్ప పాపులారిటీని క్యాష్ చేసుకునే ప్రయత్నంలా కనిపిస్తోంది.

satya raj

కట్టప్ప పాత్ర పోషించిన నటుడు సత్యరాజ్ కుమారుడు శిబీ సత్యరాజ్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ సినిమాకు 'కట్టప్పావ కానోమ్' అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఆ టైటిల్ అర్థం 'కట్టప్ప కనిపించడం లేదు' అని. సత్యరాజ్ సొంత కొడుకే తన తండ్రి పోషించిన పాపులర్ పాత్రను తన సినిమాకు వాడుకుంటున్నాడన్నమాట.

అయితే ఈ టైటిల్ ప్రకటించడంతోనే విమర్శలు కూడా మొదలయ్యాయి. కేవలం పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆ చిత్ర దర్శకుడు మణి స్పందిస్తూ పబ్లిసిటీ కోసం ఈ టైటిల్ పెట్టలేదని, సినిమాలోకి కథకు సంబంధం ఉండటం వల్లనే ఈ టైటిల్ పెట్టాము, సినిమా చూసిన తర్వాత అదే సరైన టైటిల్ అని అంతా ఒప్పుకుంటారు అని స్పష్టం చేసారు.

English summary
Sathya Raj son Sibiraj's next has been titled 'Kattappava Kanom'.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu