పబ్‌లో ఆకతాయిల అల్లరి.. టాప్ సింగర్ సిధ్ శ్రీరామ్‌కు ఘోరమైన అవమానం!
దక్షిణాదిన ఇప్పుడు సిధ్ శ్రీరామ్‌కు ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఆయన స్వరంలోంచి ఓ పాట వచ్చిందంటే చాలు అది సూపర్ హిట్ అన్నమాటే. ఆయన పాడిన, పాడుతున్న పాటలన్నీ కూడా యూత్‌కు బాగా నచ్చేస్తున్నాయి. మెలోడీలను తనదైన శైలిలో పాడే సిధ్ శ్రీరామ్.. అన్నీ కూడా ప్రేమ గీతాలనే ఆలాపిస్తున్నాడు. బ్రేకప్ సాంగ్స్‌ను సైతం సిధ్ శ్రీరామ్ ఎంతో ఆర్ర్థతో పాడుతుంటాడు. అలా యూత్‌లో సిధ్ శ్రీరామ్ పేరు మార్మోగిపోతూ ఉంటోంది.

వరుస పాటలతో..
సిధ్ శ్రీరామ వరుస పాటలతో శ్రోతలను ఆకట్టుకుంటూనే ఉన్నాడు. మొత్తం దక్షిణాదిలో సిధ్ శ్రీరామ్ హవా ఒకెత్తు అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ మరో ఎత్తు. ఈ మధ్యే సిధ్ శ్రీరామ్ పాడిన ఒకే ఒక లోకం నువ్వే అనే పాట అందరినీ ఆకట్టుకుంది.

దేవీ శ్రీ ప్రసాద్‌తో..
మొదటిసారిగా దేవీ శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో సిధ్ శ్రీరామ్ పాడాడు. రంగ్ దే సినిమా కోసం ఎప్పుడూ నువ్వే అనే పాటను ఆలపించాడు.అయితే సిధ్ శ్రీరామ్ ఇలా సినిమాల కోసం కాకుండా ప్రైవేట్‌కు కాన్సర్ట్ నిర్వహిస్తుంటాడు. లైవ్ సెషన్స్‌లో పాటలు పాడి అందరినీ ఉర్రూతలూగిస్తాడు.

తాజాగా అలా..
రీసెంట్‌గా సిధ్ శ్రీరామ్ హైద్రాబాద్‌లోని ప్రైవేట్ పబ్‌లో కాన్సర్ట్ పెట్టాడు. అయితే ఇందులో క్రౌడ్ ఎక్కువగా రావడంతో కార్యక్రమం అంతా రసాభాసాగా మారినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా కొందరు ఆకతాయిలు సిధ్ శ్రీరామ్‌ను ఘోరంగా అవమానించినట్టు తెలుస్తోంది.

నీళ్లు, మద్యం సీసాలు..
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం 10లో ఉన్న ఓ ప్రముఖ ఫబ్‌లో ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరాంకు అవమానం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఓ ఈవెంట్‌కు హాజరైన శ్రీరాంపై నీళ్లు, మద్యం విసిరి కొందరు ఆకతాయిలు అవమానించారు. అకాయితాయిలను గెట్ అవుట్ అంటూ సిద్ శ్రీరామ్ వార్నింగ్ ఇవ్వడంతో మరింతగా గొడవ చెలరేగినట్టు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











