ముగ్గురు హీరోలకు కలిపి నేనొక్కదాన్నే:తాప్సీ
తాజాగా ఈ క్యూట్‌గాళ్ 'ఛస్మే బద్దూర్' అనే చిత్రంతో బాలీవుడ్‌లోకి కూడా ప్రవేశిసించి అక్కడా సెటిల్ అవ్వాలనే చూస్తోంది. అంతేకాదు 'డబుల్స్' అనే చిత్రంతో మలయాళ చిత్ర సీమలోకి కూడా అడుగుపెడుతున్నారు తాప్సీ. అందులో మమ్ముట్టి హీరో. బాలీవుడ్ స్టార్ డైరక్టర్ డేవిడ్ ధావన్ దర్శకత్వంలో రూపొందుతున్న క్లాసిక్ చిత్రం ఛస్మే బద్దూర్ రీమేక్ లో ఎంపికవటం చాలా ఆనందాన్ని ఇస్తోంది అంటోంది. ముగ్గురు అబ్బాయిలు...ఒకమ్మాయి మధ్య జరిగే ఈ తమాషా కథలో కాస్త సెక్సీ లుక్ తో పాటు రెగ్యులర్ హీరోయిన్ కాకూడదని ఆయన భావించి ఆమను ఎంపికచేసారని చెప్తున్నారు.
తాప్సీ ముఖంలో కనుపడే అమాయికత్వం ఈ చిత్రానికి ప్లస్ అవుతుందంటున్నాడు. ఇక తాప్సీ ఈ ఆఫర్ కి పులకించిపోతోంది. హీరోలు ఎవరు అని అడగకుండా వెంటనే కమిటైపోయా అంటోంది. ఎంత ట్రై చేసినా త్రిషకు,ఇలియానా,కాజల్ కు బాలీవుడ్ లో రాని బ్రేక్ ఈమెకు వస్తుందేమో చూడాలి అంటున్నారు విశ్లేషకులు. ప్రస్తుతం ఆమె తెలుగులో గుండెల్లో గోదారి చిత్రాన్ని పూర్తి చేసింది. ఈ చిత్రం మరందేన్ మనిత్తేన్ పేరుతో తమిళంలోను విడుదల కానుంది.
అలాగే వెంకటేష్ సరసన షాడో చిత్రంలో నటిస్తున్నాను. గోపిచంద్‌కు జంటగా ఒక యాక్షన్ చిత్రాన్ని చేస్తున్నాను. మరికొన్ని చిత్రాల ఒప్పందాలపై సంతకం చేయాల్సి ఉంది అని చెప్పింది. తన ప్లస్ పాయింట్స్ చెపుతూ... నేను క్లాసికల్ డ్యాన్స్‌తో పాటు నాలుగేళ్ల నుంచే కథక్ నృత్యాన్ని నేర్చుకున్నాను. అప్పటినుంచి స్టేజిపై పెర్ఫార్మెన్స్ ఇచ్చాను. ఇక నటన అనేది ఇండస్ట్రీలోనే నేర్చుకున్నాను. చాలామంది క్రియేటివ్ వ్యక్తుల వద్ద పని చేసిన అనుభవం ఉంది. దీనితోనే మరింత ఉన్నతస్థాయికి చేరుకుంటాను అంది.


Click it and Unblock the Notifications












