For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సిద్దార్థ కొత్త చిత్రం 'సుకుమారుడు'

    By Srikanya
    |
    siddardha
    గతంలో సుందరాకాండ వంటి అనేక విజయవంతమైన చిత్రాలు నిర్మించిన శ్రీ సౌదామిని క్రియేషన్స్ అధినేత కె.వి.వి. సత్యనారాయణ సమర్పణలో సిద్దార్థ్ హీరోగా ఓ ప్రేమకథాచిత్రం రూపొందనుంది. 'సుకుమారుడు' పేరుతో రూపుదిద్దుకునే ఈ చిత్రానికి 'పిల్ల జమిందార్' సినిమా దర్శకుడు అశోక్ దర్శకత్వం వహిస్తారు. యువతరం ప్రేమకథాచిత్రంగా పూర్తి స్థాయి వినోదాత్మకంగా దీనిని నిర్మించనున్నట్లు నిర్మాత కె.వేణుగోపాల్ చెప్పారు. హీరోయిన్, ఇతర వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని సహ నిర్మాత చక్రవర్తి రామచంద్ర తెలిపారు. ఇక నాని హీరోగా వచ్చిన పిల్ల జమీందార్ చిత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. గతంలో దర్శకుడు అశోక్ ఫ్లాష్ న్యూస్,ఆకాశరామన్న,ఉషోదయం చిత్రాలు డైరక్ట్ చేసారు.

    ఆయన తొలి హిట్ పిల్ల జమీందార్. ఫన్,మెసేజ్ కలగలసిన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని బాగా ఆకట్టుకుంది. సిద్దార్ధ విషయానికి వస్తే ఆయన లేటెస్ట్ ఓహ్ మై ప్రెండ్ భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. చాలా కాలంగా ఆయన సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం తన సొంత బ్యానర్ లో దిల్ రాజు తో కలిసి లవ్ ఫెయిల్యూర్ చిత్రం నటిస్తూ నిర్మిస్తున్నారు. ఈ కొత్త సంవత్సరం తనకు కలిసి వచ్చి హిట్స్ వస్తాయని సిద్దార్ధ భావిస్తున్నారు. ఇక ఈ 'సుకుమారుడు'చిత్రానికి సమర్పణ: కె.వి.వి సత్యనారాయణ, ఐశ్వర్య.

    English summary
    Hero 'SIDDHARDH' new film titled 'SUKUMAARUDU' directed by Ashok.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X