సిద్దార్ధ ది మొదలవుతోంది
సిద్దార్ద హీరోగా రాఘవేంద్రరావు కుమారుడు ప్రకాశరావు దర్శకత్వంలో ఓ చిత్రం పూజ జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడా చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ ఇరవై ఒకటి నుండి ప్రారంభం కానుంది. ఓయ్ చిత్రం తర్వాత సిద్దార్ధ మరే చిత్రం కమిట్ కాకుండా ఎదురు చూస్తున్నారు. మిక్కీ జె.మేయర్ సంగీతంలో ఇప్పటికే పాటలు పూర్తయ్యాయి. కథ కూడా పూర్తి స్క్రిప్టు తో జె.కె.భారవి డైలాగులతో రెడీ అవుతోంది. దర్శకుడు ప్రకాశరావు ప్రస్తుతం హీరోయిన్ ఎంపికలో ఉన్నారు. ఇక ఈ చిత్రం సెమీ ఫాంటసీగా జరుగుతంది. కెమెరా వర్క్ కి మంచి ప్రాధాన్యత ఉండటంతో భిళ్ళా చిత్రానికి కెమెరా ఇచ్చిన సుందర్ రాజన్ ని ఎంపికచేసారు. ఇక ప్రకాశరావు నటుడుగా మార్నింగ్ రాగ చిత్రంలో చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. దర్శకుడుగా బొమ్మలాట అనే చిన్నపిల్లల చిత్రం రూపొందించి అందరి ప్రశంసలు పొందారు. ఇప్పుడీ కమర్షయల్ ప్రాజెక్టుతో తండ్రి పేరు నిలబెడతాడని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











