నగ్న పోస్టర్ పై సిద్దార్ద స్పందన
ముంబై : బాలీవుడ్ అగ్రనటుల్లో అమీర్‌ఖాన్‌కు ప్రత్యేక స్థానముంది. ఆయన తాజా చిత్రం 'పీకే'. ఇందులో ఓ సన్నివేశంలో అర్ధనగ్నంగా నటిస్తున్నారు. ఆ ఫొటోను కూడా ఇటీవల ట్విట్టర్‌లో పోస్ట్ చేసి.. 'నేనెలా ఉన్నానో చెప్పండ' అంటూ అభిమానులను అడిగారు. దీనిపై పలువురు అభ్యంతరం చెబుతున్నారు.
హీరో సిద్ధార్థ్ స్పందిస్తూ... ''కళకు ఏదీ అతీతం కాదు. అర్ధనగ్నంగా నటించడం కూడా ఒక కళ. అమీర్ ఫొటోను అశ్లీలమని చెప్పలేం. ఒలింపిక్స్‌లో ఈత పోటీల్లో స్విమ్‌సూట్ వేసుకుంటారు. వాటిని చూసి ఎవ్వరూ అలా డ్రస్సులు వేసుకోవడం లేదు. కళాకారులకు, కథా రచయితలకు పూర్తి స్వాతంత్య్రం ఇవ్వాలి. అప్పుడే ప్రభంజనాలకు చోటుంటుంది. నిషేధం, కేసు.. అనుకుంటూ వెళ్తే ఏ మంచి సినిమానూ తెరపైకి తీసుకురాలేరు''ని పేర్కొన్నారు.

పాత్ర డిమాండ్ చేస్తే దేనికైనా సిద్ధం అయ్యే హీరోలు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఒకరు. తాజా చిత్రం 'పీకే'లో నగ్నంగా కనిపించేందుకు సిద్ధమయ్యాడట ఈ మిస్టర్ పెర్‌ఫెక్సనిస్ట్. 'పీకే' చిత్రంలోని అమీర్ పరిచయ సన్నివేశంలో ఒక చిన్న స్టీరియో సెట్‌ను అడ్డంగా పెట్టుకొని నగ్నంగా కనిపించారు. ఈ అవతారంలో ఉండే పోస్టర్‌ను విడుదల చేసి, సంచలనం క్రియేట్ చేసారు.
సినిమా విషయానికొస్తే.. ఇందులో అమీర్ ఓ అంతరిక్షవాసిగా కనిపిస్తాడు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఈ చిత్రం ఓ వ్యంగ్యాస్త్రమని సమాచారం. రాజ్‌కుమార్ హిరానీ ఈ చిత్ర దర్శకుడు. డిసెంబరు 19న చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
కరణ్ జోహార్ స్పందిస్తూ ''అద్భుతంగా ఉంది. సినిమాపై ఆసక్తిని పెంచుతోంది'' అని ట్వీట్ చేశాడు. ''పిచ్చెక్కిపోతోంది. సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాం'' అంటూ విశాల్ దద్లానీ వ్యాఖ్యానించాడు. ఈ స్పందనలను చూశాక అమీర్ మళ్లీ ట్వీట్ చేస్తూ, ''గ్రహాంతర వాసా? ఆది మానవుడా? తాగుబోతా? అబ్బో... ఇలా చాలా రకాలుగా ఊహిస్తున్నారు. హ..హ్హ...హా... చాలా ఆనందంగా ఉంది'' అని రాశాడు.


Click it and Unblock the Notifications











