Don't Miss!
- News మూటెలు మోసిన అపర కుబేరుడు నవీన్ జిందాల్
- Sports GT vs DC: వార్నర్‌పై వేటు..కుర్రాడికి అవకాశం- పంత్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
- Lifestyle కొత్తగా పెళ్ళైన జంటలు ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మీ లైఫ్ సేవ్ చేస్తుంది
ఈ సారైనా చిక్కుతాడా...లేక
హైదరాబాద్ :సిద్ధార్థ్, లక్ష్మీమీనన్ జంటగా నటించిన తమిళ చిత్రం 'జిగర్తండ'. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించారు. కదిరీశన్ నిర్మాత. తెలుగులో 'చిక్కడు దొరకడు' పేరుతో విడుదలవుతోంది. వచ్చే నెల రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి ప్రయత్నాలు చేస్తున్నామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రం మొదట తమిళ,తెలుగులో ఒకే సారి విడుదల చేయాలనుకున్నారు. అయితే రకరకాల కారణాలుతో ఆగిపోయింది. తర్వాత తమిళంలో ఈ చిత్రం విజయం సాధించింది. దాంతో ఇప్పుడీ చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని నిర్ణయించుకున్నారు.
నిర్మాత మాట్లాడుతూ ''తమిళంలో ఘన విజయం సాధించిన చిత్రమిది. సిద్ధార్థ్లోని నటుడిని మరో కోణంలో ఆవిష్కరించింది. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో తెలుగు ప్రేక్షకులకు నచ్చే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభించింది. సినిమా అందరినీ అలరిస్తుంద''న్నారు.
ఈ సినిమాకి హైలైట్ అని చెప్పుకునే అంశం ఈ సినిమా దర్శకుడు. తమిళ్లోనే కాక తెలుగులో కూడా తన మొదటి చిత్రంతోనే కమర్షియల్ సక్సెస్‌ని సాధించిన 'పిజ్జా' సినిమా దర్శకుడు కార్తిక్ సుబ్బురాజ్ ఈ 'చిక్కడు దొరకడు' చిత్రానికి దర్శకత్వం వహించాడు. అదే మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్, అదే టీమ్ ఈ చిత్రానికి పని చేసారు.
సిటీ బ్యాక్‌డ్రాప్‌లో ఒక యంగ్‌స్టర్ లైఫ్‌లో మొదలై కర్నూలు రౌడీషీటర్స్ ప్రపంచాన్ని టచ్ చేస్తూ, మంచి లవ్‌స్టోరీ, కామెడీ క్యారెక్టర్స్ మధ్య ట్రావెల్ అయి చిత్రమైన మలుపులు తిరుగుతూ చివరికి ఎవరూ ఊహించని క్లయిమాక్స్‌లో ఎండ్ అవుతుంది. ఆడియన్స్ ఒక కొత్త అనుభూతిని కలిగించే ఒక మ్యూజికల్ గ్యాంగ్‌స్టర్ లవ్‌స్టోరీగా తెరకెక్కించారు.
మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, చంద్రబోస్, కెమెరా: సంతోష్ నారాయణ్, ఎడిటింగ్: వివేక్ హర్షన్, బిజినెస్ ఎగ్జిక్యూటివ్: ఎ.ఎన్.బాలాజీ (సూపర్‌గుడ్ మూవీస్), నిర్మాత: కదిరేశన్, దర్శకుడు: కార్తిక్ సుబ్బురాజ్.