మోడ్రన్ దేవదాసు (లవ్ ఫెయిల్యూర్ ప్రివ్యూ)
సిద్దార్ధ స్వీయ నిర్మాణంలో చేసిన చిత్రం లవ్ ఫెయిల్యూర్. ఈ రోజు విడుదల అవుతున్న ఈ చిత్రంలో సిద్దార్ద్ మోడ్రన్ దేవదాసు గా కనిపించనున్నాడు. ఈ చిత్రంలో సిద్దార్దం అరుణ్ అనే చలాకి కుర్రాడు పాత్రలో కనిపిస్తాడు. అరుణ్ కి జీవితంలో ప్రత్యేకంగా లక్ష్యాలంటూ ఏమీ లేవు. ప్రేమించిన అమ్మాయి కోసం మాత్రం ఏవో కొన్ని సాహసాలు చేయాలనుకొంటాడు. ప్రేమైనా, ద్వేషమైనా అమ్మాయిలు చూపించినంతగా అబ్బాయిలు చూపించలేరని అతని నమ్మకం. అతనికి పార్వతి (అమలాపాల్) పరిచయమవుతుంది.
తొలి చూపులోనే ప్రేమిస్తాడు. కానీ పార్వతి మాత్రం... 'నో' అంటుంది. అప్పుడు అరుణ్ ఏం చేశాడు? తన ప్రేమను ఎలా సాధించుకొన్నాడు? ఈ విషయాలతో అల్లుకొన్న కథ ఇది. ఈ చిత్రం గురించి సిద్ధార్థ్ మాట్లాడుతూ ''గెలుపోటములకు అతీతంగా ఉండేదే ప్రేమ. ఇష్టపడిన అమ్మాయి కాదన్నంత మాత్రాన దేవదాసుగా మారవలసిన అవసరం లేదు. ఓటమిని కూడా పండగలా జరుపుకోవచ్చు. అలా అనుకొన్న ఓ అబ్బాయి కథ ఇది. ప్రతి సన్నివేశం వినోదాత్మకంగా సాగుతుంది'' అన్నారు.
సంస్థ: ఇటాకీ ఎంటర్‌టైన్‌మెంట్
నటీనటులు: సిద్ధార్థ్, అమలాపాల్, సురేష్, రవి రాఘవేందర్, బాలాజీ, శ్యామ్, సురేఖావాణి తదితరులు
సంగీతం: తమన్
దర్శకత్వం: బాలాజీ మోహన్
నిర్మాతలు: సిద్ధార్థ్, కె.వేణుగోపాల్
విడుదల: శుక్రవారం.


Click it and Unblock the Notifications











